• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కొడంగ‌ల్ ఎన్నిక వాయిదా వేసేందుకు కుట్ర‌..! రేవంత్ సందేహం వెన‌క కార‌ణాలేంటి..?

|
  Telanagana Elections 2018 : రేవంత్ సందేహం వెన‌క కార‌ణాలేంటి..? | Oneindia Telugu

  హైద‌రాబాద్ : తెలంగాణ‌లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి ఈ మ‌ద్య సంచ‌ల‌నాల‌కు కేంద్ర‌బిందువ‌వుతున్నారు. తెలంగాణ లో ప్ర‌భుత్వ విధానాల‌ను విమ‌ర్శించాల‌న్నా, ముఖ్య‌మంత్రికి కౌంట‌ర్ ఇవ్వాల‌న్నా రేవంత్ రెడ్డి త‌ర్వాతే ఎవ‌రైనా అనే రేంజ్ కి చేరుకున్నారు రేవంత్. ఐతే ప్ర‌భుత్వానికి కొర‌క‌రాని కొయ్య‌గా త‌యారైన రేవంత్ రెడ్డిని నిలువ‌రించేందుకు ప్ర‌భుత్వం త‌న‌పై కుట్ర‌లు చేస్తోంద‌ని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. కొడంగ‌ల్ నియోజ‌క వ‌ర్గంలో త‌న గెలుపు అనివ‌ర్యంమ‌ని భావించిన అదికార పార్టీ ఎలాగైనా అక్కడి ఎన్న‌క‌ను వాయిదా వేయిదా వేసేందుకు కార‌ణాల‌ను వెదుకుతోంద‌ని సందేహాల‌ను వ్య‌క్తం చేసారు. రేవంత్ రెడ్డి సందేహం వెన‌క అస‌లు కార‌ణాలేంటి..? తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం..!

  రేవంత్ రెడ్డి వ్య‌క్తం చేస్తున్న సందేహాలు..! కొడంగ‌ల్ లో ఏంజ‌రుగుతోంది..!

  రేవంత్ రెడ్డి వ్య‌క్తం చేస్తున్న సందేహాలు..! కొడంగ‌ల్ లో ఏంజ‌రుగుతోంది..!

  రాజ‌కీయాల్లో త‌న ప‌ర బేదం పెద్ద‌గా ఉండ‌దు. అదికారం కోసం అవ‌స‌రాన్ని బ‌ట్టి ఎంత‌కైనా తెగించే ప‌రిస్థితులు ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో నెల‌కొన్నాయి. ప్ర‌త్య‌ర్ధిని దెబ్బ‌కొట్టేందుకు అనేక మార్గాలను అన్వేషిస్తున్న రాజ‌కీయ పార్టీలు అది వీలు కాక‌పోతే సొంత పార్టీనుండి న‌రుక్కొచ్చే సంత్క్రుతికి శ్రీ‌కారం చుడుతున్నారు. అంటే సొంత పార్టీ నేత‌నే బ‌లి ప‌శ‌వుగా చిత్రీక‌రించి అక్క‌డ అల‌జ‌డి వాతావ‌ర‌ణం స్రుష్టించి త‌ద్వారా ల‌బ్ది పొందాల‌నేది ప్ర‌త్య‌ర్ధి పార్టీల వ్యూహంగా తెలుస్తోంది. ఇదే వాతావ‌ర‌ణం ఇప్పుడు కొడంగ‌ల్ నియోజ‌క వ‌ర్గంలో నెల‌కొంద‌ని టీపిసిసి వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ రేవంత్ రెడ్డి అనుమానాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు.

  రేవంత్ రెడ్డిని నిల‌వ‌రించేంద‌కు గులాబీ పార్టీ కుట్ర‌..! అనుమానం వ్య‌క్తం చేస్తున్న రేవంత్ రెడ్డి..!

  రేవంత్ రెడ్డిని నిల‌వ‌రించేంద‌కు గులాబీ పార్టీ కుట్ర‌..! అనుమానం వ్య‌క్తం చేస్తున్న రేవంత్ రెడ్డి..!

  తెలంగాణలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గాల్లో కొడంగల్ ఒకటి. తెలంగాణలోనే పవర్‌ఫుల్ లీడర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం కావడమే దీనికి ప్రధాన కారణం. ప్రభుత్వంపై, గులాబీ అధినేత కేసీఆర్, మంత్రలు ఇలా ఒక్కరిని కూడా వదలకుండా విమర్శనాస్త్రాలు సంధిస్తూ తమకు సింహస్వప్నంలా మారిన రేవంత్‌రెడ్డిని ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో టీఆర్ఎస్ పార్టీ ఉంది. అందుకోసం ఎన్నో వ్యూహాలు సిద్ధం చేస్తోంది. అంగ, ఆర్థిక బలమున్న పట్నం నరేందర్‌రెడ్డిని పోటీలో పెట్టడంతో పాటు మంత్రి హరీశ్‌కు ఆ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. మరో మంత్రి కేటీఆర్ సైతం ఈ స్థానంపై కన్నేసి ఉంచగా, స్వయంగా కేసీఆరే ఇక్కడి పరిస్థితులపై దృష్టి సారిస్తున్నారు.

  అదికార పార్టీ అభ్య‌ర్థి పై ఐటీ దాడుల మ‌ర్మం ఏంటి..? మ‌త‌ల‌బు ఉందంటున్న రేవంత్..!!

  అదికార పార్టీ అభ్య‌ర్థి పై ఐటీ దాడుల మ‌ర్మం ఏంటి..? మ‌త‌ల‌బు ఉందంటున్న రేవంత్..!!

  టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా ప్రచారం కూడా నిర్వహిస్తున్నాయి. అక్కడ రేవంత్‌రెడ్డి అభిమానులు ఆయన విజయంపై ధీమాగా ఉన్నారు. అయినా టీఆర్ఎస్ ప్రయత్నాలను మాత్రం ఆపడంలేదు. తాజాగా కొడంగల్ విషయంలో టీఆర్ఎస్ అధినాయకత్వం అదిరిపోయే ప్లాన్ సిద్ధం చేసిందంటూ వార్తలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని స్వయానా రేవంతే చెప్పడం చర్చనీయాంశం అయింది. రెండు రోజుల క్రితం కొడంగల్‌లో ఐటీ శాఖ దాడులు కలకలం రేపాయి. నియోజకవర్గంలోని కోస్గి మండలం మీర్జాపూర్‌లోని టీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి నివాసంలో బుధవారం తెల్లవారుజాము నుంచి దాదాపు 45 నిమిషాల పాటు సోదాలు జరిగాయి. ఆయన మామ జగన్నాథరెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌, బావమరిది శ్రీధర్‌రెడ్డి కార్యాలయంలోనూ సోదాలు జరిగాయి.

  ఐటీ సోదాల్లో దొరికిన డ‌బ్బెవ‌రిది..! విచార‌ణ వేగ‌వంతం చేయాలంటున్న కాంగ్రెస్..!!

  ఐటీ సోదాల్లో దొరికిన డ‌బ్బెవ‌రిది..! విచార‌ణ వేగ‌వంతం చేయాలంటున్న కాంగ్రెస్..!!

  ఎన్నికల్లో పంపిణీ చేయడానికి పెద్ద మొత్తంలో నగదును దాచిపెట్టారన్న పక్కా సమాచారం అందడంతో ఈ సోదాలు చేశామని ఐటీ అధికారులు తెలిపారు. నరేందర్‌రెడ్డి బంధువులు, అనుచరుల సిమెంటు ఫ్యాక్టరీలు, ఇళ్లలోనూ అధికారులు సోదాలు చేశారు. ఫామ్‌హౌస్‌ తనిఖీల్లో 51 లక్షలు లభించినట్లు పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. అయితే, అక్కడి తనిఖీల్లో 15 కోట్ల‌కు పైగానే దొరికాయని తెలుస్తోంది. ఈ తనిఖీలతో టీఆర్ఎస్.. తమిళనాడులోని ఆర్కేనగర్‌లో ఎన్నిక తరహాలో కొడంగల్‌లో కూడా ఎన్నికను వాయిదా వేయించాలని ప్లాన్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయాన్ని రేవంత్‌ నోట వినడంతో దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. త‌న‌ను నిలువ‌రించేందుకు అదికార పార్టీ ఇలాంటి క‌స‌ర‌త్తులు చేస్తోంద‌నే సందేహాలు స్వ‌యంగా రేవంత్ ప్ర‌స్థావించ‌డం సంచ‌నంగా మారింది.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  హైదరాబాద్ యుద్ధ క్షేత్రం
  ఓటర్లు
  Electors
  • పురుషులు
   పురుషులు
  • స్త్రీలు
   స్త్రీలు
  • ట్రాన్స్ జెండర్లు
   N/A
   ట్రాన్స్ జెండర్లు

  English summary
  Kondangal is one of the most prestigious constituencies in Telangana. The main reason is that the Powerful Leader, TPCC Working President Ravant reddy represents constituency. There is a TRS party with a strong desire to defeat Revant reddy, who has turned to the swapping of criticisms of the government, the pink chief KCR and the ministers. There are many strategies to prepare to stop revanth victory in kodangal.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more