హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ.5.22 కోట్ల నగదు బదిలీ: కేటీఆర్, తోసిపుచ్చిన కోమటిరెడ్డి సంకీర్త్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

మునుగోడు బై పోల్ వేళ ప్రలోభాల పర్వం పీక్‌కి చేరింది. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలను ప్రధాన పార్టీలు చేస్తున్నాయి. భారీగా నగదు, మద్యం పంపిణీ చేస్తోంది. బీర్లు, బిర్యానీలకు లెక్కే లేదు. అయితే నిన్న మంత్రి కేటీఆర్ బీజేపీకి సంబంధించి కీలక ఆరోపణలు చేశారు. ఓకే రోజు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన కంపెనీ సుశీ ఇన్ ఫ్రా నుంచి కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయని తెలిపారు. ఆ మేరకు డాక్యుమెంట్ కూడా చూపించారు.

రూ.5.22 కోట్ల నగదు


మొత్తం రూ.5.22 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు నగదు బదిలీ జరిగిందని కేటీఆర్ అన్నారు. 16, 17, 18వ తేదీన ఈ ట్రాన్సాక్సన్స్ జరిగాయని తెలిపారు. నవ్య శ్రీ, దిండు భాస్కర్ పంతంగి ఇతరులకు నగదు పంపిణీ చేశారని తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల సంఘానికి కంప్లైంట్ కూడా చేశామని వివరించారు. ఒక్కొక్కరికీ రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు బదిలీ చేశారని వివరించారు.

కొత్త స్టోరీ

కొత్త స్టోరీ


మంత్రి కేటీఆర్ ఆరోపణలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుమారుడు, సుశీ ఇన్ ఫ్రా కంపెనీ సీఈవో కోమటిరెడ్డి సంకీర్త్ రెడ్డి స్పందించారు. అదంతా పేక్ అని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మంత్రి కేటీఆర్ కొత్త స్టోరీ చెబుతున్నారని.. ఫేక్ న్యూస్ అని రాశారు. తమ కంపెనీ నుంచి అలాంటి లావాదేవీలు జరగలేదని వివరించారు. అదంతా తప్పు అని.. కావాలనే ప్రచారం చేస్తున్నారని విమర్శలు చేశారు.

కేటీఆర్ వద్ద ఆధారాలు

కేటీఆర్ వద్ద ఆధారాలు


సంకీర్త్ వర్షన్ ఇలా ఉండగా.. మంత్రి కేటీఆర్ వద్ద ఆధారాలు ఉన్నాయి. వాటిని ఈసీకి పంపించడంతో చర్యలు తీసుకోనుంది. మరీ నగదు పంపిణీపై ఎన్నికల సంఘం ఏం చెప్పనుందో చూడాలీ మరీ. సంకీర్త్ చేసిన ట్వీట్ బట్టి ఆధారాలు లేవని అనుకోలేదు. లావాదేవీలపై సమీక్షించి ఈసీ డెసిషన్ తీసుకోనుంది. ఇటు బై పోల్ వేళ.. మునుగోడులో మద్యం ఎరులై పారుతుంది. గిప్టులు కూడా భారీగా చేరుతున్నాయి. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ ఉండబోతుంది.

English summary
komatireddy sankeerth reddy ceo of sushi infra company counter minister ktr allegations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X