హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అంగన్ వాడీ టీచర్లు, ఆయాలకు చేనేత చీరల పంపిణీ

|
Google Oneindia TeluguNews

నేతన్నలకు ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రతీ సోమవారం నేతలు చేనేత వస్త్రాలను ధరిస్తున్నారు. అలాగే ఉద్యోగులు, సిబ్బందికి కూడా చేనేత వస్త్రాలను అందజేస్తున్నారు. ఇవాళ మంత్రి కేటీఆర్.. అంగన్ వాడీ సిబ్బందికి అందజేశారు. ఇప్పటికే వారి జీతం పెంచిన సంగతి తెలిసిందే.

అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు నేత చీరలను మంత్రి కేటీఆర్ పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్ వాడీ టీచర్లకు జీతాలు రివైజ్ చేసి, ఆయాలకు వేతనాన్ని మూడింతలు చేస్తూ.. పీఆర్సీని 30 శాతం పెంచారు. నేత వస్త్రాలను ప్రమోట్ చేసే దిశగా.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 67వేల 411మంది అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు చీరలు పంపిణీ చేయనున్నారు.

 ktr distributes handlooms sarees to anganwadi teachers

హ్యాండ్‌లూమ్స్ మినిష్టర్ కేటీఆర్ రామారావు, మంత్రి సత్యవతి రాథోడ్ లు ప్రగతి భవన్ వేదికగా అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు చీరలు పంపిణీ చేశారు. ట్రాన్స్‌జెండర్స్ తయారుచేసిన జ్యూట్ బ్యాగ్స్ ను కూడా మంత్రి కేటీఆర్ రిలీజ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 31వేల 711 అంగన్వాడీ సెంటర్లతో పాటు, 3వేల 989 మినీ అంగన్వాడీ సెంటర్లలో పనిచేస్తున్న 67వేల 411మంది అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ఈ చీరలు పంపిణీ చేస్తారు. ఇప్పటికే ఉమెన్ అండ్ ఛైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు ఏటా రెండు చీరలు ఇస్తుంది. అదనంగా నేత చీరలు పంపిణీ చేయాలని అనుకుంటున్నారు.

నేత చీరల పంపిణీతో.. నేతన్నలకు మరింత ఉపాధి పెరుగుతుంది. ఇటు ఆయా సిబ్బందికి కూడా ప్రోత్సాహకం అందనుంది. కరోనా వేళ అందరీ ఉపాధిపై ప్రభావం చూపనుంది. చేనేతలు నేసిన చీరలను ప్రభుత్వం పంపిణీ చేయడంతో వారికి మేలు జరుగుతుంది. ప్రజల్లో కూడా చాలా మట్టుకు అవేర్ నెస్ వచ్చింది. చేనేత వస్త్రాలపై మక్కువ చూపుతున్నారు.

English summary
telangana minister ktr today distributes handlooms sarees to anganwadi teachers and aayas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X