తేలికపాటి జల్లులు: పెరిగిన చలి, ఉదయం, రాత్రి ఈదురు గాలులు

రాష్ట్రంలో శనివారం అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. శుక్రవారం పొడి వాతావరణం ఉంటుందని, ఈశాన్య దిశ నుంచి కింది స్థాయి గాలులు తెలంగాణ వైపు వీస్తున్నాయని వెల్లడించింది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గురువారం ఆగ్నేయ బంగాళాఖాతం వరకు కొనసాగుతున్నట్లు తెలిపింది.

 light rain tomorrow at telangana

ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉన్నదని, ఉపరితల ద్రోణి సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తువరకు వ్యాపించి ఉందని పేర్కొంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గిపోతుండడంతో చలి తీవ్రత పెరుగుతోంది. ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు ఆవరిస్తోంది. గురువారం ఆదిలాబాద్‌లో 15.7 డిగ్రీల అత్యల్ప కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. హన్మకొండ, హైదరాబాద్‌, మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో 20 డిగ్రీల కంటే తక్కువగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Recommended Video

    Weather : Heavy Rains Till Oct 17 Due To Low Pressure || Oneindia Telugu

    ఇటు ఉదయం చలి తీవ్రత ఎక్కువగానే ఉంది. రాత్రి పూట కూడా మంచు కురుస్తోంది. తేమ వల్ల మధ్యాహ్నం తడి ఆరిపోతుంది. దాహం ఎక్కువగా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం కరోనా కేసులు లేకున్నా.. థర్డ్ వేవ్ భయం మాత్రం ఉంది. జనవరి నుంచి అంటున్నందున జాగ్రత్తగా ఉండటమే మంచిది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+