లీటర్ పెట్రోల్ రూ.40కే ఇవ్వొచ్చు.. మోడీ, కేసీఆర్ కలిసి చిల్లు: రేవంత్ రెడ్డి

నలబై రుపాయలకు లీటర్ పెట్రోల్ పోయ్యొచ్చు అని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. జీఎస్టీ పేరుతో ప్రధాని మోడీ 33 రూపాయలు, సీఎం కేసీఆర్ 32 రూపాయలు ప్రజల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.

యూపీఏ అధికారంలో ఉన్న సమయంలో క్రూడాయిల్ ధర లీటర్‌కు 70 రూపాయలు ఉంటే ఇప్పుడు 40 రూపాయలు ఉందని గుర్తుచేశారు. అప్పుడు లీటర్ పెట్రోల్ ధర 71 రూపాయలు ఉంటే ఇప్పుడది 105 రూపాయలకు చేరుకుందన్నారు. వంట గ్యాస్ ధర ఏడేళ్లలో నాలుగు వందల యాబై రుపాయలు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 litre petrol will give rs.40:revanth reddy

కరోనా సమయంలో కూడా మోడి, సీఎం కేసీఆర్‌ పేదల జేబుల కొట్టారని పేర్కొన్నారు. వీళ్లను ఏమని పిలువాలి? ఒక దేశం.. ఒకే ఎన్నికలు అని చెప్పే మోడి, పెట్రోల్‌కు దేశమంతా ఒకే ధరను ఎందుకు అమలు చెయ్యట్లేదని ప్రశ్నించారు. పెట్రోల్‌పై నూట యాబై ఐదు శాతం జీఎస్టీ అమలు చేస్తున్నట్లు చెప్పారు రేవంత్ రెడ్డి.

రాంజీగోండు, కొమురం భీం స్ఫూర్తితో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం తీసుకురావడానికి యాత్ర మొదలు పెట్టానని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి అధికారం కొత్త కాదని, అధికారం కోసం తహతహలాడుతూ కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కెసిఆర్ ప్రజల జేబులు లూటీ చేస్తున్నారని మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+