16వ తేదీ నుంచి రుణమాఫీ: ఖాతాలో జమచేయాలి, కట్ చేసుకోవద్దు: మంత్రి హరీశ్ రావు
రైతుల ఖాతాలో రుణమాఫీ నగదు ఈ నెల 16వ తేదీ నుంచి జమకానుంది. రూ.50 వేల వరకు రైతు రుణాలను మాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. శుక్రవారం బీఆర్‌కేఆర్ భవన్‌లో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. 42 బ్యాంకుల అధికారులు సమావేశానికి హాజరయ్యారు.
15వ తేదీన ప్రకటన
రూ. 50 వేల లోపు రైతు రుణ మాఫీపై క్యాబినెట్ సమావేశంలో సీఎం ఆదేశాల మేరకు సమావేశం నిర్వహిస్తున్నామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఆగష్టు 15 వ తేదీన సీఎం కేసీఆర్ లాంఛనంగా రూ. 50 వేలలోపు రైతు రుణాల మాఫీ ప్రకటన చేస్తారని చెప్పారు. ఆగష్టు 16వ తేదీ నుంచే ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 2,006 కోట్లు జమ అవుతాయన్నారు. బ్యాంకర్లు , ప్రభుత్వ అధికారులు సమన్వయంతో రైతుల ఖాతాల్లో రుణ మాఫీ మొత్తం జమ అయ్యేలా చూడాలని.. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని బ్యాంకర్లకు సూచించారు.

సీఎం పేరుతో మేసెజ్
రైతుల ఖాతాల్లో రుణ మాఫీ మొత్తం జమ అవగానే ముఖ్యమంత్రి పేరుతో రైతు రుణం మాఫీ అయినట్లు లబ్ధిదారుల ఫోన్లకు సందేశాలు వెళ్లాలన్నారు. రైతు రుణ మాఫీతోపాటు కొత్త పంట రుణానికి మీరు అర్హులని ఆ సందేశంలో తప్పకుండా పేర్కొనాలన్నారు. రైతుల ఖాతాల్లో జమ అయిన రుణ మాఫీ మొత్తాన్ని మరే ఇతర ఖాతా కింద జమ చేయవద్దన్నారు. రైతులకు ఇబ్బందులు సృష్టించవద్దన్నారు. రుణ మాఫీ లబ్దిదారులైన రైతుల ఖాతాలను జీరో చేసి కొత్త పంట రుణం ఇవ్వాలన్నారు.
ఇబ్బందులు ఉండొద్దు
రైతుల రుణ మాఫీ చెల్లింపుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వానికి అన్ని బ్యాంకులు సహకరించాలన్నారు. బ్యాంకులు ఎలాంటి ఆంక్షలు విధించకుండా రైతులకు రుణ మాఫీ మొత్తం చేరేలా చూడాలన్నారు. వ్యవసాయ శాఖ తరుపున సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఆర్థిక, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, ఆయా బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications