వివాహేతర సంబంధం పెట్టుకుని.. లక్షలు గుంజింది... ట్రాక్టర్‌కు కట్టేసి కొట్టిన స్థానికులు
సిరిసిల్లా : సమాజ పోకడలో ఏమో కానీ .. లోకంలో వావి వరసలు మాయమవుతున్నాయి. ప్రేమలు, పలకరింపుల చోట .. వివాహేతర సంబంధాలు దారితీస్తున్నాయి. ఇక భర్త ఉపాధి కోసం విదేశం వెళ్లిన కొందరు మహిళలు రెచ్చిపోతున్నారు. వివాహేతర సంబంధం పెట్టుకొని కాలం గడిపేస్తున్నారు. కొన్ని ఘటనలు వెలుగులోకి రాగా .. మరికొన్ని మాత్రం బయటకు రావడం లేదు. రాజన్న సిరిసిల్లా జిల్లాలో కూడా ఓ మహిళ వివాహేతర సంబంధం ఘటన కలకలం రేపింది. దాడి చేసే వరకు పరిస్థితి వెళ్లింది.
బంధం బయటపడిందిలా ..
సిరిసిల్లా జిల్లా చిన్నబోనాలులో స్వప్న ఉంటుంది. అయితే ఆమె భర్త ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. ఇదే అదనుగా భావించిన స్వప్న .. అదే గ్రామానికి చెందిన నారాయణ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వీరి చాటు కాపురం సావ్యంగా సాగుతుంది. అయితే నారాయణ నుంచి స్వప్న డబ్బులు కూడా వసూల్ చేసింది. లక్షల రూపాయలు వసూల్ చేయడం, నారాయణ ఇంట్లో డబ్బులు ఇవ్వకపోవడంతో కుటుంబసభ్యులు ఆగ్రహానికి గురయ్యారు.

నారాయణ భార్య, గ్రామస్తులు స్వప్నను అతడితో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయితే నారాయణ వెంటనే పారిపోయారు. స్వప్న దొరకడంతో ఆమెను అక్కడే ఉన్న ట్రాక్టర్‌కు కట్టేసి కొట్టారు. గ్రామస్తులు స్వప్నను చితక్కొట్టారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే ఘటనాస్థలానికి పోలీసులు చేరుకున్నారు. దాడిని అడ్డుకున్నారు. ఘటనపై చర్యలు తీసుకుంటామని భరోసానివ్వడంతో గ్రామస్తులు శాంతించారు.












Click it and Unblock the Notifications