• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఆ శక్తి IoTకే ఉంది: హైదరాబాద్‌లో ది థింగ్స్ కాన్ఫరెన్స్ ఇండియా 2019

|

హైదరాబాద్: LoRaWAN® టెక్నాలజీతో దేశాన్ని స్మార్ట్ చేయడానికి విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న ది థింగ్స్ కాన్ఫరెన్స్ ఇండియా 2019 (The Things Conference India 2019). ఆసియా ఖండం లోనే అతి పెద్ద LoRaWAN® సదస్సును నిర్వహించనున్న హైదరాబాద్ కు చెందిన సైబర్ఐ (CyberEye).

స్మార్ట్ వ్యవసాయం మొదలుకొని స్మార్ట్ సిటీస్ వరకు వందల కొద్ది రంగాలలో ఇంటర్నెట్ అఫ్ థింగ్స్ (IoT) గొప్ప ఉపయోగాలు ఉన్నాయి. దశాబ్దాల క్రితం ఎలా అయితే అంతర్జాలం (Internet) ఆవిష్కరణ తో ప్రపంచంలో ఒక నవ శకం మొదలైందో మళ్ళి అటువంటి విప్లవాత్మక మార్పును ప్రపంచంలో తీసుకురాగల శక్తి IoT కి ఉంది.

LoRaWAN: The Things Conference India held at HICC, Hyderabad

ఇంత గొప్ప సామర్ధ్యం ఉన్న IoT కి LoRaWAN®️ టెక్నాలజీ తోడుఅవ్వడం తో మునుపెన్నడు లేనన్ని కొత్త ఆవిష్కరణాలు అతి తక్కువ ఖర్చుతోనే సాధ్యమవుతున్నాయి. IoT వల్ల దాదాపు అన్ని రంగాల్లో ఉపయోగాలు ఉన్నప్పటికీ, భారీ స్థాయిలో కొన్ని కోట్ల పరికరాలను అనుసంధానం చేయడంలో ఇబ్బందులు చాలానే ఉండేవి.

IoT పరికరాలు అతి తక్కువ బ్యాటెరీ లైఫ్ మరియు మెమొరీ ను వాడుకుంటూ వాటి మధ్య ఉండే సుదీర్ఘ దూరాలలో సైతం కమ్యూనికేట్ చేస్తూ పని చేయలేవు. ప్రస్తుత పరిస్థితుల్లో IoT కి ఉన్న ఈ పరిమితులు వల్ల ఆ టెక్నాలజీ ని సెల్లులార్ కనెక్షన్, వైఫై మొదలగు వాటిలో ఉపయోగించడానికి వీలు లేకుండా ఉండేది.

అతి తక్కువ ఖర్చు తో ఒక పరికరం పదుల కిలోమీటర్ల పరిధిలో సైతం కమ్యూనికేట్ చేస్తూ 5 నుండి 10 సంవత్సరాల కాళం పాటు పనిచేయడం LoRaWAN టెక్నాలజీ ప్రత్యేకత. IoT యొక్క అతి క్లిష్ట ఉపయోగాలను సైతం సాధారణ జీవనం లోకి తీసుకువస్తూ IoT యొక్క రూపాన్ని మార్చగల శక్తిని LoRaWAN కలిగి ఉంది.

LoRaWAN కి ఉన్న భారీ ఉపయోగాల చేత దీనిని ఉపయోగించలేని రంగం అనేదే లేకపోవచ్చు. పరిశ్రమలు యాంత్రీకరణ, లాజిస్టిక్స్, పర్యావరణ పర్యవేక్షణ, ఆరోగ్యం, స్మార్ట్ నగరాలు మొదలగు రంగాలలో LoRaWAN టెక్నాలజీ ఎంతో కీలక పాత్ర పోషించనుంది.

స్మార్ట్ నగరాలను నిర్మించడానికి భారత్ సిద్ధం అవుతోంది. ఈ కలను అత్యంత వేగంగా నిజం చేయడం లో LoRaWANను ఒక గొప్ప పరిష్కారం గా చూడవచ్చు. ఇండియా లో IoT పరిశ్రమ కి ఉన్న విలువ ను పెంచుతూ భారత దేశాన్ని స్మార్ట్ గా చేయడం లో ఈ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుంది.

ప్రపంచం అంతటా ఈ సాంకేతికతకు ఆసక్తి పెరుగుతున్న తరుణంలో, అద్భుతమైన ప్రయోజనాలను అందుకోవడానికి ఇది ఒక చక్కని అవకాశం గా చెప్పవచ్చు. ఒక గొప్ప LoRaWAN వ్యవస్థ ను భారత దేశం లో ఏర్పాటు చేయడానికి CyberEye సంస్థ HICC హైదరాబాద్ నందు అక్టోబర్ 18, 19 తేదీలలో "ది థింగ్స్ కాన్ఫరెన్స్ ఇండియా 2019" అనే సదస్సు ను నిర్వహించనుంది.

ఆసియా ఖండం లోనే అతి పెద్ద LoRaWAN సదస్సు అయిన "ది థింగ్స్ కాన్ఫరెన్స్ ఇండియా 2019" ప్రపంచం లో IoT మరియు LoRaWAN రంగాలలో నిష్ణాతులైన ప్రముఖ సంస్థల సీఈఓలు, సిటిఓలు, వివిధ ప్రభుత్వాల ప్రతినిధులు, పారిశ్రామిక ధీటులు, స్టార్ట్ అప్స్, వంటి వందలాదిని భవిష్యత్ లో ఈ రంగాలలో ఉండే అవకాశాలను చర్చించడానికి ఒక్క చోటకు చేర్చనుంది.

LoRaWAN టెక్నాలజీ లో ఉన్న నిపుణుల నుండి ఆసక్తిపరుల వరకు అందరికి ఈ పరిజ్ఞానాన్ని అందించి, అంతర్జాతీయ సంస్థల ఉత్పత్తులను ప్రదర్శించే అవకాశాన్ని ఇస్తూ, ఒక గొప్ప వ్యాపార అవకాశాన్ని కల్పించే కేంద్రంలా "ది థింగ్స్ కాన్ఫరెన్స్ ఇండియా 2019" ఉండనుంది.

స్టార్ట్ అప్స్ ను ప్రోత్సహించే iB Hubs సహకారం తో CyberEye సంస్థ ఈ సదస్సును నిర్వహిస్తుంది. CyberEye సంస్థ, భారత దేశం లో స్మార్ట్ మరియు భద్రత కలిగిన సమాజాన్ని తయారు చేయాలి అనే సంకల్పంతో దూసుకుపోతుంది. ది థింగ్స్ కాన్ఫరెన్స్ ఇండియా 2019తో బలమైన IoT - LoRaWAN వ్యవస్థ కల్గిన భారత దేశాన్ని తయారు చేసి, అత్యాధునిక టెక్నాలజీ లో భారత్ ను ప్రపంచం లో అగ్రగామి లా ఉండేలా చేయాలి అనే ధృడ నిశ్చయం తో CyberEye సంస్థ ఈ సదస్సు ను నిర్వహిస్తోంది.

ఈ సదస్సు లో మీరు కూడా పాల్గొనాలంటే www.thethingsconference.in లో మీ టిక్కెట్లను పొందండి.

English summary
CyberEye, are organizing the second edition of Asia's Largest Conference on LoRaWAN, The Things Conference India on October 18-19 at Hyderabad International Convention Centre (HICC), Hyderabad, India. Many countries across the world have recognized the potential of LoRaWAN and are implementing the technology to build Smart Nations. The changes it could bring in India are immense. LoRaWAN can reduce the costs involved in building Smart Cities multifold. With this technology, a Smart India is not very far.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more