లెక్ఛరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి అరెస్ట్,
ఉదయం నుండి తెలంగాణ రాష్ట్ర లెక్ఛరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న ఏసిబీ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. సోదాలు ముగిసిన తర్వాత అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఆయనపై ఫిర్యాదులు రావడంతో సోదాలు జరుపుతున్నట్టు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. సోదాల నేపథ్యంలోనే ఆయన భారీగా అక్రమాలకు పాల్పడ్డట్టు వెల్లడైందని చెప్పారు. అక్రమ ఆస్తులపై కేసు నమోదు చేసుకుని ఈ రోజు 10 చోట్ల సోదాలు నిర్వహించామని చెప్పారు. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మరియు కర్నూల్ జిల్లాలో సోదాలు చేస్తున్నట్టు చెప్పారు.
కాగా సోదాల్లో ఇప్పటివరకు మూడు కోట్ల రూపాలయకు పైగా ఆస్తులున్నట్టు గుర్తించామని చెప్పారు. వీటితో పాటు హోండా సిటితోపాటు ఇన్నోవా కారను సీజ్ చేసినట్టు చెప్పారు. ఇంటర్ పేపర్ లీకేజీలో భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు వచ్చాయని, రెండు ఫ్లాట్స్ పత్రాలను స్వాధీనం చేసుకున్నామన్నారు.. బంధువుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయని, సోదాలు పూర్తయిన తర్వాత ఆయన్ను అరెస్ట్ చేస్తామని డీఎస్పీ చెప్పారు. కాగా ఆయన్ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ ఇంటినుండి ఏసీబీ కార్యాలయానికి తరలించారు.

అయితే మధుసూదన్ రెడ్డి మాత్రం తాను ఎలాంటీ అక్రమాలకు పాల్పడలేదని మీడియాతొ చెప్పారు. ఒకవేళ బినామీ అస్తులుంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చని చెప్పారు.












Click it and Unblock the Notifications