హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేసిన ఏసిబీ.

|
Google Oneindia TeluguNews

శుక్రవారం ఉదయం నుండి తెలంగాణ రాష్ట్ర లెక్ఛరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న ఏసిబీ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకుని సోదాలు ముగిసిన తర్వాత అరెస్ట్ చేశారు.. ఆనంతరం నాంపల్లి లోని ఏసీబీ కోర్టులో హజరు పరచనున్నారు.

ప్రభుత్వ లెక్ఛరర్ల సంఘం అధ్యక్షుడిగా ఉన్న మధుసూదన్‌రెడ్డిపై ఫిర్యాదులు రావడంతో సోదాలు జరిపినట్టు ఏసీబీ డీఎస్పీ ప్రకటించారు. సోదాల నేపథ్యంలోనే ఆయన భారీగా అక్రమాలకు పాల్పడ్డట్టు వెల్లడైందని ఆయన చెప్పారు. అక్రమ ఆస్తులపై కేసు నమోదు చేసుకున్న ఏసీబీ అధికారులు హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మరియు కర్నూల్ జిల్లాలో సహా మొత్తం 10 చోట్ల సోదాలు నిర్వహించామని తెలిపారు.

madhusudhan reddy has been produced in ACB court

కాగా సోదాల్లో మూడు కోట్ల రూపాలయకు పైగా ఆస్తులున్నట్టు గుర్తించామని చెప్పారు. వీటితో పాటు హోండా సిటితోపాటు ఇన్నోవా కారను సీజ్ చేసినట్టు చెప్పారు. ఇంటర్‌ పేపర్‌ లీకేజీలో భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు వచ్చాయని, రెండు ఫ్లాట్స్‌ పత్రాలను స్వాధీనం చేసుకున్నామన్నారు.. బంధువుల ఇళ్లలో సోదాలు జరిపామని, సోదాలు పూర్తయిన తర్వాత ఆయన్ను అరెస్ట్ చేసినట్టు ఆయన చెప్పారు.. కాగా ఆయన్ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ శుక్రవారం రాత్రి ఇంటినుండి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఇక మొత్తం 40 కోట్ల వరకు అక్రమ ఆస్తులు ఉన్నట్టు ఏసీబీ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే మధుసూదన్ రెడ్డి మాత్రం తాను ఎలాంటీ అక్రమాలకు పాల్పడలేదని మీడియాతొ చెప్పారు. ఒకవేళ బినామీ అస్తులుంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చని చెప్పారు.

English summary
madhusudhan reddy who is telangana state lectures association president has been arrested and prodused in court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X