కొన్ని కులాలే పాలిస్తున్నాయి, బలహీనవర్గాలకు అన్యాయం జరుగుతోంది: స్వామిగౌడ్ హాట్ కామెంట్స్
తెలంగాణ శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుల రాజకీయాలపై బహిరంగంగా కామెంట్ చేశారు. రాష్ట్రం, కేంద్రంలో కొన్ని కులాలో పరిపాలన సాగిస్తున్నాయని మండిపడ్డారు. బడుగు బలహీనవర్గాలకు అధికారం దూరంగా ఉంటుందని చెప్పారు. కొద్దీ మంది ఉన్న అగ్ర కులాలే పాలిస్తున్నారని పరోక్షంగా ధ్వజమెత్తారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో శ్రీ నారాయణ గురు జయంతి వేడుకలు జరిగాయి. కార్యక్రమంలో పాల్గొన్న స్వామి గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అధికారం అందరికీ కాదు.. కొందరికే పరిమితమైందని స్వామిగౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బలహీనవర్గాలకు రాజ్యాధికారానికి దూరంగా ఉంటూనే వస్తున్నారని చెప్పారు. ఎన్నాళ్లీ వివక్ష.. కులజాఢ్యం వికృత రూపాన్ని ప్రదర్శిస్తోన్న బలహీనవర్గాలు ఎందుకు మిన్నకుండిపోతున్నారని ఆయన ప్రశ్నించారు. తమ అస్థిత్వం కోసం బడుగులు పోరాడాల్సిందేనని స్పష్టంచేశారు. ఇక పోరుబాట పట్టాల్సిందేనని పిలుపునిచ్చారు.

నారాయణ గురు ఆశయాలను బలహీనవర్గాలకు చెందిన ప్రజలు ముందుకు తీసుకెళ్లాలని కోరారు. అలా ముందుకెళ్లినప్పుడే వారికి మనం ఇచ్చే నివాళి అని గుర్తుచేశారు. బడుగు, బలహీనవర్గాలు సంఘటితం కావాల్సిన అవసరం ఉందన్నారు. మండలి చైర్మన్ పదవీ కాలం ముగిసాక ప్రత్యక్ష రాజకీయాలకు స్వామి గౌడ్ దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. ఇన్నాళ్లకు అగ్ర కులాలపై కామెంట్స్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.












Click it and Unblock the Notifications