హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేడు సామూహిక జాతీయ గీతాలాపన; అబిడ్స్ వద్ద పాల్గొననున్న సీఎం కేసీఆర్; ట్రాఫిక్ ఆంక్షలు!!

|
Google Oneindia TeluguNews

75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని మంగళవారం నాడు నిర్వహించనున్నారు.

 అబిడ్స్ పోస్ట్ ఆఫీస్ దగ్గర ప్రముఖ జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం కేసీఆర్

అబిడ్స్ పోస్ట్ ఆఫీస్ దగ్గర ప్రముఖ జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం కేసీఆర్

రాష్ట్రమంతా ఒకే సమయంలో జాతీయ గీతం పాడేలా ఏర్పాటు చేశారు. అబిడ్స్ పోస్ట్ ఆఫీస్ దగ్గర సామాజిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. కెసిఆర్ అబిడ్స్ పోస్ట్ ఆఫీస్ దగ్గర సామాజిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో ఆబిడ్స్ వైపు వెళ్లే మార్గాలలో ట్రాఫిక్ నిబంధనలు విధించారు. ఆ మార్గంలో వెళ్లే వారు ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు

Recommended Video

హైటెక్ సిటి చౌరస్తాలో సామూహిక జాతీయ గీతాలాపన.. *National | Telugu OneIndia
 అన్ని ట్రాఫిక్ కూడళ్లలో ఒక నిమిషం పాటు రెడ్ సిగ్నల్ వేసి సామాజిక జాతీయ గీతాలాపన

అన్ని ట్రాఫిక్ కూడళ్లలో ఒక నిమిషం పాటు రెడ్ సిగ్నల్ వేసి సామాజిక జాతీయ గీతాలాపన

అన్ని ట్రాఫిక్ కూడళ్లలో ఒక నిమిషం పాటు రెడ్ సిగ్నల్ వేసి ఈ సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సామూహిక జాతీయ గీతాలాపన నేపద్యంలో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలలో ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లుగా నగర ట్రాఫిక్ సిపి రంగనాథ్ వివరించారు. నగరంలోని లిబర్టీ ,బషీర్ బాగ్ నుండి అబిడ్స్ వైపు వచ్చే వాహనాలను బిజెఆర్ సర్కిల్ వద్ద ఏఆర్ పెట్రోల్ పంప్, నాంపల్లి స్టేషన్ రోడ్డుకు మళ్ళించనున్నారు.

సామూహిక జాతీయ గీతాలాపన సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్ ఇలా

సామూహిక జాతీయ గీతాలాపన సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్ ఇలా


లిబర్టీ వైపు నుండి వచ్చే ఆర్టీసీ బస్సులను బిజెఆర్ సర్కిల్ వైపు అనుమతించే అవకాశం లేదు. లిబర్టీ వద్ద హిమాయత్ నగర్, నారాయణ గూడ, కాచిగూడ, కోఠీ రూట్ లోకి మళ్లిస్తారు. అంతేకాదు కింగ్ కోఠీ నుంచి వచ్చే వాహనాలను హనుమాన్ టెక్డి, ట్రూప్ బజార్, కోఠీ వైపు మళ్ళించనున్నారు. ఇక బొగ్గులకుంట నుండి అబిడ్స్ వైపు వచ్చే వాహనాలను బొగ్గులకుంట క్రాస్ రోడ్డు వద్ద హనుమాన్ టెక్డి, ట్రూప్ బజార్, కోఠీ వైపు మళ్ళించనున్నారు. ఎంజే మార్కెట్, జాంబాగ్ నుండి అబిడ్స్ వైపు వచ్చే వాహనాలను ఎంజే మార్కెట్ నుండి నాంపల్లి వైపు మళ్లిస్తారు. పిసిఆర్ నుండి బిజెఆర్ సర్కిల్ మీదుగా ఆబిడ్స్ వైపు వచ్చే వాహనాలను ఏ ఆర్ పెట్రోల్ పంప్ నుంచి నాంపల్లి స్టేషన్ రోడ్ లోకి మళ్లిస్తారు.

 ఈ ప్రాంతాలలో విపరీతంగా ట్రాఫిక్ రద్దీ.. ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాలని సూచన

ఈ ప్రాంతాలలో విపరీతంగా ట్రాఫిక్ రద్దీ.. ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాలని సూచన


ఇక సోమాజిగూడ - ఖైరతాబాద్ - రవీంద్ర భారతి జంక్షన్ - అసెంబ్లీ - ఎల్‌బి స్టేడియం - బిజెఆర్ విగ్రహం - లిబర్టీ - హిమాయత్‌నగర్ - జిపిఓ అబిడ్స్ - ఎంజె మార్కెట్ - నాంపల్లి వద్ద ట్రాఫిక్ రద్దీ ఉంటుందని భావిస్తున్నారు. ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.30 గంటల మధ్య ఈ మార్గాలను నివారించాలని, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణం చేయాలని ట్రాఫిక్ పోలీసులు ప్రజలను కోరారు.

అబిడ్స్ వద్ద జాతీయ గీతాలాపనకి వచ్చేవారి వాహనాలకు పార్కింగ్ స్థలాలు:

అబిడ్స్ వద్ద జాతీయ గీతాలాపనకి వచ్చేవారి వాహనాలకు పార్కింగ్ స్థలాలు:


లిబర్టీ నుండి అబిడ్స్ సర్కిల్ వద్ద సామూహిక జాతీయ గీతాలాపనకు హాజరయ్యేందుకు వచ్చే వాహనాలను నిజాం కాలేజీ గ్రౌండ్స్, తాజ్ మహల్ నుండి కింగ్ కోటి ఎక్స్ రోడ్స్, బాటా నుండి బొగ్గులకుంట ఎక్స్ రోడ్స్, జిహెచ్ఎంసి ఆఫీస్, రామకృష్ణ థియేటర్, సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ వద్ద పార్క్ చేయాలని సూచిస్తున్నారు. అఫ్జల్‌గంజ్‌లోని ఎంజే మార్కెట్‌ నుంచి అబిడ్స్‌ సర్కిల్‌ వద్ద జరిగే కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చే వాహనాలను అన్నపూర్ణ హోటల్‌ రోడ్డులోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో పార్కింగ్‌ చేయాలని సూచిస్తున్నారు. నగరవాసులు తమ గమ్యస్థానాలకు ప్రత్యామ్నాయ మార్గాలను తీసుకోవాలని మరియు పేర్కొన్న సమయాల్లో పై మార్గాలను నివారించాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.

English summary
A mass national anthem program will be organized today as part of the Independence Diamond Jubilee celebrations. CM KCR will participate in the National Anthem singing program at Abids Post Office. Due to this, traffic restrictions were imposed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X