పెన్షన్ కావాంటే సినిమాకు రా.. యువతికి అధికారి వేధింపులు
ఆడదంటే చిన్నచూపే.. అవును తక్కువ చూడటం సరికాదు. ఇప్పటికీ అలానే ఉంది పరిస్థితి. కుటుంబంలో అందరినీ పోగొట్టుకున్న యువతికి,, తండ్రి పింఛన్ మంజూరు చేయటానికి ట్రెజరీ అధికారి లైంగికంగా వేధించారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. హైదరాబాద్ శివారు మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో నివసించే యువతి తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేసి రిటైర్ అయ్యారు. పింఛన్ తో బతికే ఆయన ఇటీవల మరణించారు. అంతకు ముందే తల్లి మరణించింది. దీంతో తల్లితండ్రులిద్దరూ చనిపోయిన ఆ యువతి అనాధలాగా మారింది.

తండ్రికి వచ్చే పింఛన్ తనకు మంజూరు చేయాలని కోరుతూ మేడ్చల్ ట్రెజరీ ఆఫీసులో నాలుగు రోజుల క్రితం దరఖాస్తు చేసుకుంది. దరఖాస్తును పరిశీలించిన అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ పవన్ కుమార్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. తనతో సినిమాకు వస్తేనే పింఛన్ మంజూరు చేస్తానని లైంగికంగా వేధించాడు. మరోసారి ట్రెజరీ ఆఫీసుకు వెళ్ళినప్పడు కూడా ఆ యువతిని వేధింపులకు గురి చేశాడు. యువతి తీవ్రంగా ప్రతిఘటించటంతో ఆ అధికారి ఆఫీసుకు నుంచి మెల్లగా జారుకున్నాడు. విషయాన్ని అక్కడి అధికారులకు, టీఆర్ఎస్ నాయకులకు యువతి వివిరంచారు.
ఏటీవోకు, యువతికి మధ్య రాజీ కుదిర్చారే గానీ అసలు విషయం బయటకు రానియ్యలేదు. యువతి చెప్పేదంతా అబధ్దమని కొట్టి పారేస్తున్నాడు. యువతి తనకు పెళ్లి కాలేదని అబధ్ధం చెపుతూ పింఛన్ కోసం దరాఖాస్తు చేసుకుందని అంటున్నారు. నిబంధనల ప్రకారం ఆమె దరఖాస్తును తిరిస్కరించి రికవరీకి ఆదేశాలివ్వడంతోనే యువతి తనపై లేనిపోని ఆరోపణలు చేస్తోందని చెప్పారు.












Click it and Unblock the Notifications