Bill Gates: 25 ఏళ్ల తర్వాత హైదరాబాద్ కు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్..

తెలంగాణ సాంకేతిక రంగంలో దూసుకెళ్తోంది. ప్రపంచస్థాయి కంపెనీలు హైదరాబాద్ లో ఆఫీసులు ఏర్పాటు చేసుకున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి మల్టీనేషనల్ కంపెనీలు హైదరాబాద్ లో కార్యలాయాలు ఏర్పాటు చేసుకున్నాయి. హైదరాబాద్ లో 1998లో మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్‌మెంట్‌ సెంటర్‌(IDC)ని ఏర్పాటు చేసింది. దీన్ని ప్రారంభించేందుకు 25 ఏళ్ల క్రితం మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ హైదరాబాద్ కు వచ్చారు.

అప్పటి నుంచి ఐడీసీ మైక్రోసాఫ్ట్ లో కీలక పాత్ర పోషిస్తోంది. టీడీపీ హాయంలో సీఎం చంద్రబాబు ఐటీపై ఎక్కవు దృష్టి పెట్టి ప్రపంచస్థాయి కంపెనీలను తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అప్పటి నుంచి ఐటీలో హైదరాబాద్ దూసుకెళ్తోంది. మైక్రోసాఫ్ట్ ఐడీసీ బింగ్‌, కోపిలాట్‌, అజూర్‌, విండోస్‌, ఆఫీస్‌ఇతర ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) టూల్స్‌ అభివృద్దికి తోడ్పాటు అందిస్తోంది. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ 25 ఏళ్ల తర్వాత మళ్లీ హైదరాబాద్ కు వచ్చారు.

Microsoft head Bill Gates came to Hyderabad after 25 years

హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ ఐడీసీని బుధవారం సందర్శించారు. భవిష్యత్తులో ఏఐ, క్లౌడ్‌, గేమింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ వంటి రంగాల్లో మైక్రోసాఫ్ట్‌ ఆవిష్కరణలకు ఐడీసీ కేంద్రం అవుతుందని ఐడీసీ చీఫ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ చెప్పారు. ఐడీసీలో ఇంజినీర్లను ఉద్దేశించి బిల్‌గేట్స్‌ ప్రసంగించినట్లు చెప్పారు. ఏఐ పవర్డ్‌ ఇండియాపై బిల్‌ గేట్స్‌ మరోసారి ఆశాభావం వ్యక్తం చేసినట్లు వివరించారు.

అయితే ఐటీ కంపెనీలు కేవలం హైదరాబాద్ కేంద్ర పని చేస్తున్నాయని పలువురు చెబుతున్నారు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత కరీంనగర్, వరంగల్ నగరాల్లో ఐటీని అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీని అభివృద్ధి చేస్తే హైదరాబాద్ పై ఒత్తిడి తగ్గుతోందని వివరించారు. ప్రస్తుతం హైదరాబాద్ లో సామాన్యులు బతకడం కష్టంగా మారిందన్నారు. అందుకే.. ఐటీని కరీంనగర్, వరంగల్ నగరాల్లో అభివృద్ధి చేయాలని అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+