కేంద్రంపై కేటీఆర్ గుస్సా.. చిన్నచూపు అని ధ్వజం
తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన సహకారం అందడం లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. విభజన చట్టం హామీలను కేంద్రం తుంగలో తొక్కుతుందని మండిపడ్డారు. ఇవాళ మీడియాతో మాట్లాడారు. బీజేపీ సర్కార్ తెలంగాణపై చిన్నచూపు చూస్తోందని స్పష్టంచేశారు. ఎందుకు తెలంగాణ అంటే అలా వ్యవహరిస్తోందో తెలియడం లేదన్నారు.

ప్రభుత్వ ఉద్యోగాలను రాష్ట్రంలో భర్తీ చేశామని చెప్పారు. కానీ దీనిపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 వేలకు పైగా కంపెనీలకు అనుమతులు ఇచ్చామని వివరించారు. సుమారు 15 లక్షల ఉపాధి అవకాశాలను సృష్టించగలిగామన్నారు. కానీ వారికి అవేం పట్టాయని ఫైరయ్యారు. ఎప్పుడూ తమపై ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నాయని వివరించారు.
తెలంగాణపై వివక్ష కొనసాగుతూనే ఉంది అని కేటీఆర్ అన్నారు. ప్రేమ మాత్రం లేదని చెప్పారు. నిధుల కేటాయింపు, ప్రాజెక్టులు.. ఇతరత్రా అంశాలపై చిన్న చూపు ఉందన్నారు. పలు సందర్భాల్లో ఈ విషయం అర్థమవుతోందని చెప్పారు.












Click it and Unblock the Notifications