TGSRTC: తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రిలో సిటీ స్కాన్ సెంటర్ ను ప్రారంభించిన పొన్నం..
హైదరాబాద్ తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రిలో శనివారం నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ సెంటర్ ను రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు ప్రారంభించారు. అలాగే ఎంఆర్ఐ ఆధునిక వైద్య పరీక్షా కేంద్రాలతో పాటు ఫిజియోథెరఫీ యూనిట్, ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్, ఫార్మసీని కూడా ప్రారంభించారు. అనంతరం తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిలో కలిగియ తిరిగారు. చికిత్స కోసం వచ్చిన ఆర్టీసీ సిబ్బందితో ఆయన ముచ్చటించారు.
ఆ తర్వాత తార్నక ఆర్టీసీ ఆస్పత్రిలో వైద్యులతో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు సమావేశమయ్యారు. సిబ్బందికి అందిస్తోన్న వైద్య సేవల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. అంతకముందు ఆస్పత్రి ప్రాంగణంలో మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, సంస్థ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇక ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం 175 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడుపుతోంది.

హైదరాబాద్ లోని 24 ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు తిప్పనుంది. కాచిగూడ రైల్వే స్టేషన్, జేబీఎస్, పటాన్ చెరు, ఈసీఐఎల్, మెహిదీపట్నం, దిల్ షుక్‌నగర్, కూకట్‌పల్లి, చార్మినార్, ఉప్పల్, మల్కాజిగిరి, పాత బోయిన్‌పల్లి, మల్కాజిగిరి, తదితర ప్రాంతాల నుంచి సికింద్రాబాద్ వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. బోనాలకు వెళ్లే భక్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంస్థ కోరుతోంది.
#Hyderabad తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రిలో శనివారం నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ స్కాన్, ఎంఆర్ఐ ఆధునిక వైద్య పరీక్షా కేంద్రాలతో పాటు ఫిజియోథెరఫీ యూనిట్, ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్, ఫార్మసీని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు (@Ponnam_INC) ప్రారంభించారు.… pic.twitter.com/kPn2NyoKwH
— VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) July 20, 2024
ఎంజీబీఎస్ నుంచి 5 బస్సులు, కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి 4, జేబీఎస్ నుంచి 5, చార్మినార్ నుంచి 5, బాలాజీ నగర్ నుంచి 8, నాంపల్లి నుంచ 8, రిసల్ బజార్ నుంచి 8, వెంకటపూరం నుంచి 8, ఓల్డా అల్వాల్ నుంచి 8, మెహదీపట్నం నుంచి 8, కుషాయి గూడ నుంచి 8, చర్లపల్లి నుంచి 8, హకీంపేట నుంచి 8, ఓల్డ్ బోయిన్ పల్లి నుంచి 8, సైనిక్ పూరి నుంచి 8, సనత్ నగర్ నుంచి 8, జామై ఉస్మానియ నుంచి 8, జీడిమెట్ల, జగద్గీరి గుట్ట నుంచి 8 చొప్పున బస్సులు నడపనున్నారు.












Click it and Unblock the Notifications