అలా చేసి ఉంటే ప్రియాంకారెడ్డి బతికేది.. హత్యాఘటనపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి
డాక్టర్ ప్రియాంకారెడ్డి లైంగిక దాడి, హత్య ఘటన దేశ్యవాప్తంగా అందర్నీ కలిచివేస్తున్నది. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖ తక్షణమే స్పందించింది. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి వెంటనే అనుమానితులను అదుపులోకి తీసుకొన్నది. ఈ క్రమంలో ప్రియాంకారెడ్డి తల్లిదండ్రులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా మీడియాతో మాట్లాడుతూ..

మరో లోకం తెలియదు
ప్రియాంకారెడ్డి తల్లిదండ్రులు, కుటుంబంతో మాట్లాడానని, తీవ్ర విషాదంలో ఉన్న వారిని పరామర్శిచి ధైర్యాన్ని చెప్పినట్టు మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీడియాతో అన్నారు. ప్రియాంకరెడ్డికి ఇళ్లు, ఉద్యోగం తప్ప మరో లోకం, వ్యాపకం తెలియదు. మాకు ఎవరిపై అనుమానం లేదు. లారీ డ్రైవర్లే ఈ దారుణానికి పాల్పడ్డారు అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు.

కఠినంగా శిక్షిస్తాం
ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ కేసు దర్యాప్తుకు ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసి పురోగతి సాధించారు. నిందితులను కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించేందుకు చర్యలు తీసుకొంటున్నాం. తల్లిదండ్రులు కోరుతున్న విధంగా నిందితులను కఠినంగా శిక్షిస్తాం అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

షీటీమ్స్‌తో కట్టుదిట్టమైన చర్యలు
భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటున్నాం. మహిళల రక్షణే మొదటి ప్రాధాన్యతగా తెలంగాణ ప్రభుత్వం షీటీమ్స్‌ను ఏర్పాటు చేసింది. షీటీమ్స్ ఇలాంటి ఘోరాలు జరుగకుండా సక్సెస్‌ఫుల్‌గా పనిచేస్తున్నాయి. ఎలాంటి చిన్న ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకొంటున్నాయి అని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు.
Recommended Video

మహిళలు ఇలా జాగ్రత్త పడాలి
దైనందిక జీవితంలో ఎలాంటి అనుమానం వచ్చినా మహిళలు, అమ్మాయిలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి దారుణాలకు గురికాకుండా షీటీమ్స్, పోలీసుశాఖకు సంబంధించిన టోల్ ఫ్రీ నంబర్లను మొబైల్‌లో ఫేవరేట్ లిస్టులో ఉంచుకోవాలి. స్పీడ్ డయల్ లిస్టులో షీ టీమ్ నంబర్ పెట్టుకోవాలి. ఒకవేళ ప్రియాంకారెడ్డి ఇంటికి ఫోన్ చేసినట్టే.. షీ టీమ్‌కు ఫోన్ చేసి ఉంటే ఈ దారుణం చోటుచేసుకొని ఉండేది కాదు అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications