హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ వరదలు.. మంత్రి సబితా ఇంద్రారెడ్డికి చేదు అనుభవం.. నిలదీసిన కార్పొరేటర్లు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరం అతలాకుతలమవుతోంది. గత వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ లో వరదలు ముంచెత్తాయి. వేలాది కాలనీలు నీటమునిగాయి. ప్రజల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. గ్రేటర్ హైదరాబాద్ లో పరిస్థితి దారుణంగా తయారైంది. వరద ముంపుకు గురైన ప్రాంతాలలో సహాయక చర్యలు అందటం లేదని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పాలకులపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఒలంపియన్ గగన్ కలలపై నీళ్ళు .. హైదరాబాద్ వరదల్లో మునిగిన షూటింగ్ అకాడమీ రైఫిల్స్,పిస్టల్స్ఒలంపియన్ గగన్ కలలపై నీళ్ళు .. హైదరాబాద్ వరదల్లో మునిగిన షూటింగ్ అకాడమీ రైఫిల్స్,పిస్టల్స్

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి కి చేదు అనుభవం

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి కి చేదు అనుభవం


ఇప్పటికే అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు ప్రజల నుండి చేదు అనుభవం ఎదురు కాగా, తాజాగా మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కూడా పరాభవం తప్పలేదు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని నాదర్ గుల్, అల్మాస్ గూడ , కుర్మల్ గూడా, బడంగ్ పేట్ లో వరదల కారణంగా దెబ్బతిన్న కాలనీల్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. అయితే బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సబితా ఇంద్రా రెడ్డిని నిలదీశారు స్థానిక కార్పొరేటర్లు .

స్థానిక కార్పొరేటర్లకు సమాచారం లేకుండా ఎలా పర్యటిస్తారని నిలదీసిన కార్పొరేటర్లు

స్థానిక కార్పొరేటర్లకు సమాచారం లేకుండా ఎలా పర్యటిస్తారని నిలదీసిన కార్పొరేటర్లు

బడంగ్ పేటలో వరదలు ముంచెత్తడంతో గత రెండు రోజులుగా స్థానిక కార్పొరేటర్లు, అధికార పార్టీ నేతలు అక్కడి ప్రజల అవసరాలను తీరుస్తున్నారు. అయితే సబితా ఇంద్రారెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న క్రమంలో తమకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా కాలనీలలో పర్యటించడంపై వారు సబితా ఇంద్రారెడ్డిని నిలదీశారు. అధికారిక కార్యక్రమం అయినప్పుడు తమకు సమాచారం ఇవ్వకుండా ఎలా వస్తారంటూ ప్రశ్నించారు.

 సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయిన సబితమ్మ

సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయిన సబితమ్మ


దీంతో సబితాఇంద్రారెడ్డి వారికి ఏ సమాధానం చెప్పకుండానే మౌనంగా వెనుదిరిగారు.

గత మూడు రోజులుగా స్థానిక ప్రజలకు అండగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్నామని, ఒక మంత్రిగా తాను పర్యటిస్తున్నప్పుడు, స్థానిక కార్పొరేటర్ లను కూడా కలుపుకొని వెళ్లాల్సిన అవసరం ఉందని కార్పొరేటర్లు చెబుతున్నారు. ఎవరికీ చెప్పకుండా సబితాఇంద్రారెడ్డి పర్యటించిన తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రానుంది గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కావటం , ఇప్పుడు ఎవరికి వారు ప్రజల దగ్గర మార్కుల కోసం తంటాలు పడుతున్న క్రమంలో అటు ప్రజల నుండి , ఇటు కార్పొరేటర్ల నుండి ఎమ్మెల్యేలకు, మంత్రులకు తిప్పలు తప్పటం లేదు .

Recommended Video

Hyderabad Floods Remembering 1908 Musi Floods That Changed Face of Hyderabad || Oneindai Telugu

English summary
A bitter experience to Minister Sabita Indrareddy . Education Minister Sabita Indrareddy visited the flood-affected colonies of Nadar Gul, Almas Guda, Kurmal Guda and Badangpet in Rangareddy district's Maheshwaram constituency. However, Sabita Indra Reddy was questioned by the local corporators under the Badang Pet Municipal Corporation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X