హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గ్రేహౌండ్స్ కమాండోలు.. అదనంగా రెండు వెహికిల్స్.. మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు పెరిగిన భద్రత

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర దుమారం రేపుతోంది. హత్యాయత్నాన్ని సైబరాబాద్ పోలీసులు భగ్నం చేసిన తెలిసిందే. కానీ మంత్రికి భద్రతను మరింత పెంచారు. భద్రత పెంచుతున్నట్టు ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. శ్రీనివాస్ గౌడ్ కు 20 మంది పోలీసులు, 10 మంది సిటీ సెక్యూరిటీ వింగ్ సిబ్బంది, ఆరుగురు ఇంటెలిజెన్స్ అధికారులు, నలుగురు గ్రేహౌండ్స్ కమాండోలతో భద్రత కల్పిస్తారు. సీఎం కేసీఆర్ తర్వాత శ్రీనివాస్ గౌడ్ మాత్రమే గ్రేహౌండ్స్ కమాండోల భద్రత తీసుకుంటారు. శ్రీనివాస్ గౌడ్ భద్రతా బృందంలో గల పోలీసులకు ఎం44 ఆయుధాలు అందిస్తారు. మంత్రి కాన్వాయ్‌లోకి అదనంగా మరో రెండు వాహనాలను పెంచారు.

అందుకే అటెంప్ట్
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యా ప్రయత్నంలో రాఘవేంద్రరాజు స్టేట్ మెంట్‌లో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. శ్రీనివాస్ గౌడ్‌తో తనకు ప్రాణ హానీ ఉందని.. అందుకే తాను చంపాలని అనుకున్నానని పేర్కొన్నారు. ఇప్పుడు కాదు 2017 నుంచి తనను చంపేందుకు ప్రయత్నం చేశారని ఆరోపించారు. తనను, తన కుటుంబాన్ని శ్రీనివాస్ గౌడ్ టార్గెట్ చేశారని వెల్లడించారు. వేధింపులు తట్టుకోలేకే శ్రీనివాస్ గౌడ్‌ను చంపాలని అనుకున్నానని తెలిపారు. అంతేకాదు తనపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి వేధించారని ఆరోపించారు. శ్రీనివాస్ గౌడ్ తనపై 30 కేసులు పెట్టించారని, తన బార్ షాప్‌ను మూసివేయించి ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. ఆర్థికంగా నష్టం చేయించడమే కాకుండా ఒక్కరోజే 10 కేసులు పెట్టించారని ఆరోపించారు. తనకు రూ. 6 కోట్లు నష్టం చేయించారని స్టేట్ మెంట్ లో రాఘవేంద్రరాజు వెల్లడించినట్లు సమాచారం. అదీ తట్టుకోలేక ఎలాగైనా పగ తీర్చుకోవాలని అనుకున్నారు. హత్య కోసం సుపారీ గ్యాంగ్‌ను ఆయన సంప్రదించారు.

minister srinivas goud protection increased

సుఫారీ ఇంత
మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ హత్యకు కుట్ర పన్నిన నాగరాజు, విశ్వనాథ్, యాదయ్యను అరెస్ట్ చేశామని సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర ప్రకటించారు. మరో ప్రధాన నిందితుడు రఘు పరారీలో ఉన్నారని వివరించారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హత్యకు మధు సుధన్ రాజు, అమరేంద్ర రాజు 15 కోట్లను సుపారీ గ్యాంగ్‌కు ఆఫర్‌ చేశారని స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేశామన్నారు. రాఘవేందర్‌రాజు, మున్నూరు రవితోపాటు మరో ముగ్గురు ఢిల్లీలో ఉన్నారని ట్రేస్ చేశామన్నారు. ఢిల్లీలో గల బీజేపీ నేత జితేందర్‌ రెడ్డి ఇంట్లో వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుల నుంచి రివాల్వర్, మొత్తం 6 రౌండ్ల బుల్లెట్స్‌ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులు యూపీ నుంచి ఆయుధాలు సమకూర్చుకున్నారని స్టీఫెన్‌ రవీంద్ర వివరించారు. ఈ హత్య కుట్రలో జితేందర్ పాత్రపై విచారిస్తున్నామని స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. డీకే అరుణ అనుచరులపై కూడా అనుమానాలు ఉన్నాయని వివరించారు. హత్య కుట్రపై శ్రీనివాస్‌గౌడ్‌కు తెలియజేశామని.. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారన్నారు.

English summary
minister srinivas goud protection increased. four Greyhounds and two additional vehicles setup.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X