ఇది టీఆర్ఎస్ అడ్డా! ఎర్రకోటపై బీఆర్ఎస్ జెండా అంటూ మంత్రులు, బీజేపీపై ఫైర్
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి. తెలంగాణ భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి తలసాని మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ గాలిబుడగా లాంటిదన్నారు.

టీఆర్ఎస్ ఎవరికీ భయపడదన్న తలసాని
టీఆర్ఎస్ నేతలను మంత్రులు, ఎమ్మెల్యేలను కేంద్రం ఇబ్బందులు పెడుతోందని తలసాని ఆరోపించారు. మంత్రి మల్లారెడ్డి పట్ల ఐటీ అధికారులు అనైతికంగా ప్రవర్తించారని మండిపడ్డారు. ఎవరి తాటాకు చప్పుళ్లకు టీఆర్ఎస్ భయపడేది లేదన్నారు. సమయం అందరికీ వస్తుందని.. రేపు మీ పరిస్థితి ఇలాగే వస్తుందన్నారు మంత్రి తలసాని.

హైదరాబాద్ టీఆర్ఎస్ అడ్డా అంటూ మంత్రి తలసాని
హైదరాబాద్ టీఆర్ఎస్ అడ్డా అని మంత్రి తలసాని వ్యాఖ్యానించారు. గడిచిన ఎనిమిదేళ్లలో అనేక కార్యక్రమాలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆత్మీయ సమ్మేళనాల్లో భాగంగా ప్రజలకు వివరించాలని సూచించారు. సమ్మేళనాలలో సమస్యలు గుర్తించి వాటిని అక్కడికక్కడే పరిష్కరించే ప్రయత్నం చేయాలన్నారు.

నిజాం కాలేజీ మైదానంలో భారీ సభ అంటూ తలసాని
గడిచిన ఎనిమిదేళ్లలో కొంతమందికి అవకాశాలు రాలేదని అసంతృప్తులు ఉండటం సహజమని.. సందర్బాన్ని బట్టి అవకాశం ఇంటికే వస్తుందని తలసాని చెప్పారు. ఆత్మీయ సమ్మేళనాల తర్వాత నిజాం కాలేజీ మైదానంలో భారీ సభను ఏర్పాటు చేస్తామని తెలిపారు. వందేళ్ల చరిత్ర ఉన్న పార్టీకే అతీగతి లేదని కాంగ్రెస్ పార్టీనుద్దేశించి వ్యాఖ్యానించారు. ఇక బీజేపీ గాలి మీద బుడగ లాంటిదని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ పార్టీ బలమైన రాజకీయ పార్టీ అన్నారు. ఎవరి తాటాకు చప్పుళ్లకు టీఆర్ఎస్ భయపడదని స్పష్టం చేశారు.

ఎర్రకోటపై బీఆర్ఎస్ జెండా అంటూ మంత్రి మల్లారెడ్డి
మరోవైపు, సిద్దిపేట జిల్లా ములుగు మండలం తునికి బొల్లారం పునరావాస కాలనీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి మల్లారెడ్డి. ఈ సందర్బంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఐటీ మినహాయింపు ఇవ్వడంతోపాటు సంపాదించిన ఆస్తిలో వాళ్లే స్వతహాగా టాక్స్ చెల్లించే విధంగా చట్టాన్ని తీసుకొస్తామన్నారు. తనపై 500 మంది పెట్టి ఐటీ దాడులు చేయించారని, అయినా తాను భయపడేది లేదన్నారు. సీఎం కేసీఆర్ ఉన్నంత వరకు తనకు భయం లేదన్నారు మల్లారెడ్డి. దేశ ప్రజలంతా సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు కోరుకుంటున్నారన్నారు. విద్యుత్, తాగునీరు అందిండంలో బీజేపీ విఫలమైందన్నారు మల్లారెడ్డి. అందుకే ప్రజలంతా కేసీఆర్ వైపే చూస్తున్నారని తెలిపారు. 2024లో ఢిల్లీ ఎర్రకోటపై బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. కేసీఆర్ మామూలు వ్యక్తి కాదని, మహాత్ముడు, గొప్పవ్యక్తి అని ప్రశంసించారు మంత్రి మల్లారెడ్డి.
-
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి..












Click it and Unblock the Notifications