మొబైల్ ఫోన్ పోతే మీ-సేవకు వెళ్లండి -సెల్ ఫోన్ చోరీ ఫిర్యాదులపై hyderabad police సూచన
మీ మొబైల్ ఫోన్ చోరీకి గురైతే సమీపంలోని మీ-సేవ కేంద్రానికి వెళ్లి ఫిర్యాదు చేయండి. అవును, మీరు చదివిన స్టేట్మెంట్ అక్షరాలా అధికారిక ప్రకటనే. టెక్ జమానా ముందుకెళుతున్నకొద్దీ దేశంలో మొబైల్ వినియోగం ఇంకా విస్తృతం కావడం, అదే స్థాయిలో మొబైల్ ఫోన్ల చోరీలు కూడా పెరగడం తెలిసిందే. కాగా, సెల్ ఫోన్ చోరీ ఫిర్యాదుల కోసం పోలీస్ స్టేషన్లకు వెళ్లాల్సిన అవసరం లేదని హైదరాబాద్ పోలీసులు చెబుతున్నారు.
సెల్ ఫోన్ చోరీలకు సంబంధించి హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మంగళవారం కీలక ప్రకటన చేశారు. మొబైల్ ఫోన్లు చోరీకి గురైతే, ఆయా బాధితులు ఇకపై ఆన్ లైన్ ద్వారా ఫిర్యాదు చేస్తే సరిపోతుందని అందుకోసం తమకు దగ్గర్లోని మీ-సేవ కేంద్రాలు లేదంటే హాక్ ఐ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని సీపీ సూచించారు.

పోలీస్ స్టేషన్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఆన్ లైన్ ద్వారా మీ-సేవ, హ్యాక్ ఐ గుండా మిస్సింగ్ ఫోన్ల ఫిర్యాదులు చేసినట్లయితే, ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఫోన్లు రికవరీ అయిన అనంతరం బాధితులకు సమాచారం అందిస్తామని సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. ఈ అవకాశాన్ని నగర పౌరులంతా సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కాగా,

హైదరాబాద్ ఓల్డ్ సిటీ పరిధిలో చోరీకి గురైన 66 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. వాటిని ఇవాళ బాధితులకు అప్పగించారు సీపీ అంజనీ కుమార్. ఇతర దేశాల వీడియోలను హైదరాబాద్‌లో జరిగినట్లు కొంతమంది ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల ఇలాంటివి తరచూ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలల్లో వెలుగులోకి వస్తున్నాయని కూడా సీపీ పేర్కొన్నారు. సోషల్ తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బల్దియా పోలీస్ బాస్ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications