హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ.20 వేల షూ: రాహుల్‌కు సీతక్క గిప్ట్, త్వరలో ఢిల్లీకి ఎమ్మెల్యే.. కారణమిదే.?

|
Google Oneindia TeluguNews

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రంలో ఉత్సాహంగా సాగింది. అందరితో రాహుల్ ఆటలు ఆడి, డ్యాన్స్ కూడా చేశారు. కుండ కూడా తయారు చేశారు. ఇవాళ్టితో తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ పాదయాత్ర ముగియనుంది. కామారెడ్డిలో ముగింపు సభ తర్వాత.. మహారాష్ట్రలో అడిగిడుతుంది. రాహల్ వెన్నంటే టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఎమ్మెల్యే సీతక్క ఉన్నారు.

జోడో యాత్రలో సీతక్క యాక్టివ్‌గా పాల్గొన్నారు. తమిళనాడులో జరిగిన పాదయాత్రకు సీతక్క అటెండ్ అయ్యారు. హైదరాబాద్ దాటి సంగారెడ్ది జిల్లాలోకి జోడో యాత్ర ఎంట్రీ ఇచ్చింది. అక్కడ గిరిజనులతో కలిసి రాహుల్ డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు సీతక్కతో కలిసి గిరిజన నృత్యం చేశారు. మీ రాష్ట్రానికి వచ్చిన సోదరుడికి గిఫ్ట్ లేదా సీతక్కా అని రాహుల్ అడిగారట. రాహుల్ సెక్యూరిటీ సిబ్బంది వద్దకెళ్లి రాహుల్ షూ సైజు, వాడే షూ కంపెనీ బ్రాండ్ గురించి తెలుసుకుని మరీ ఆ మరునాడే రాహుల్‌కు షూ ఇచ్చారట.

 mla sithakka present shoe to rahul gandhi

షూ చూసి ముచ్చటపడ్డ రాహుల్ గాంధీ తన సోదరి తనకు గిఫ్ట్ ఇచ్చిందని హ్యాపీగా ఫీలయ్యారట. పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్‌కు చెప్పుకున్నారట. రాహుల్ గాంధీకి షూ బహూకరించేందుకు సీతక్క రూ.20 వేలు ఖర్చు చేశారని తెలుస్తోంది.ఇదివరకు సీతక్క నక్సలైట్ గా పనిచేసిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని సీతక్క వద్ద రాహుల్ ప్రస్తావించి. గన్ ఎక్కడ అక్కా? అని రాహుల్ అడగ్గానే... దానిని అడవిలోనే వదిలిపెట్టి వచ్చానని సీతక్క బదులిచ్చారని తెలిసింది. త్వరలో ఢిల్లీకి పిలుస్తానని.. అక్కడ షూటింగ్‌లో పోటీ పెడతానని రాహుల్ అన్నారని సమాచారం.

తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ పాదయాత్ర శ్రేణుల్లో జోష్ నింపింది. రాహుల్ గాంధీ పిల్లలతో రన్ చేసి మరింత ఉత్సాహం నింపారు. తర్వాత గిరిజనులతో డ్యాన్స్ చేశాడు. బస్సు పైకి ఎక్కి మరీ ప్రచారం చేశారు. కుమ్మరులతో కలిసి కుండను తయారు చేశాడు. తన యాత్రతో కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపే ప్రయత్నం చేశాడు.

English summary
mla sithakka present shoe to rahul gandhi that was cost to rs.20 thousand
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X