మునుగోడు ఓటర్ల జాబితా పిటిషన్ విచారణ రేపటికి వాయిదా
మునుగోడు బై పోల్ ఓటర్ల జాబితా పిటిషన్ పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ఓటర్ల జాబితాకు సంబంధించిన నివేదికను సమర్పించాలని ఎన్నికల సంఘానికి ఆదేస్తూ విచారణను రేపటికి వాయిదా వేసింది. పిటిషన్ తరపున న్యాయవాది రచనా రెడ్డి వాదనలు వినిపించారు.
మునుగోడు ఉప ఎన్నికలో నిబంధనలకు విరుద్ధంగా ఓటర్ల నమోదు జరిగింది. ఫార్మ్ 6 ప్రకారం కొత్తగా 25 వేల ఓట్లు నమోదు చేసుకున్నారని హై కోర్టుకు తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలో వివిధ మండలాలో భారీగా ఓటర్ల నమోదు ప్రక్రియ జరిగిందని పేర్కొన్నారు. ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ ఖరారు అయ్యిందని, నవంబర్ 3 న ఉప ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు.

ఉప ఎన్నిక నేపథ్యంలో భారీగా ఓటర్ల నమోదు అక్రమంగా జరిగిందని రచనా రెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నికల సంఘం తరపున న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపించారు. తుది ఓటర్ల లిస్ట్ ఇంకా ఎన్నికల కమిషన్ ప్రకటించలేదన్నారు. ఏటా కొత్త ఓటర్లు నమోదు చేసుకుంటున్నారని చెప్పారు.
జనవరి 2021 వరకు రెండు లక్షల 22 వేల ఓట్లు ఉన్నాయని వివరించారు. నియోజకవర్గంలో 2 లక్షల 38 వేలు ఓట్లు ఉన్నాయని వెల్లడించారు. ఓటర్ల నమోదు ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందని లాయర్ అవినాశ్ వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా నమోదు అయినా ఓటర్ల జాబితా నివేదికను సమర్పించాలని ఎన్నికల సంఘానికి ఆదేశిస్తూ తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications