Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మేమే కూల్చేస్తామని జయభేరి మురళీమోహన్ వ్యాఖ్యల వెనుక నాగార్జున ఎన్ కన్వెన్షన్

హైదరాబాద్లో చెరువులు, బఫర్ జోన్లు, ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న స్థలాలలో అక్రమ నిర్మాణాలను ప్రభుత్వ భూములలో ఉన్న అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. అయితే హైడ్రా కూల్చివేతలపై మొదట్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరిలోనూ అనేక అనుమానాలు కలిగాయి ఏవో ఒకటి రెండు రోజులు కూల్చివేతలంటూ హడావిడి చేసి బడా బాబుల వద్ద డబ్బులు దండుకునే చర్యగా పలువురు ప్రత్యర్థి పార్టీల నాయకులు హైడ్రా ఏర్పాటును విమర్శించారు.

ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో సెలబ్రిటీలకు సైతం హైడ్రా షాక్..
అయితే సినిమా సెలబ్రిటీలనే కాదు సొంతవాళ్ళను కూడా లెక్కచేయకుండా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ సాగుతున్న హైడ్రా కూల్చివేతలపర్వం నిదానంగా సెలబ్రిటీలను కూడా సెట్ చేసేస్తోంది. అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో రాష్ట్రవ్యాప్తంగా హైడ్రా పై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కూల్చివేతల విషయంలో ఎవరేం చెప్పినా ఎవరు ఎంత సెలబ్రెటీ అయిన వెనక్కు తగ్గేది లేదని హైడ్రా నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో స్పష్టం చేసింది.

Nagarjuna N convention demolition effect hydra orders celebrities ready to obey

హైడ్రా నోటీసులకు మురళీమోహన్ స్పందన ఇలా
ఇదే క్రమంలో తాజాగా సినీ నటుడు మురళీమోహన్ కు చెందిన జయభేరి సంస్థకు చెందిన అక్రమనిర్మాణాలు తొలగించాలని హైడ్రా నోటీసులు ఇచ్చింది. అయితే తాను ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని చెప్పిన మురళీమోహన్ బఫర్ జోన్ లో మూడు అడుగుల మేర రేకుల షెడ్డు ఉన్నట్టు గుర్తించామని అధికారులు చెబుతున్నారని, అయితే దానిని తొలగించేందుకు హైడ్రా అధికారులు రావలసిన అవసరం ఏమీ లేదని, ఆ షెడ్డు తామే కూలుస్తామని స్పష్టం చేశారు.

మురళీ మోహన్ ప్రకటన వెనుక ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఎఫెక్ట్
గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్టిక్ లోని రంగులాల్ కుంట చెరువుల బఫర్ జోన్ లో నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని హైడ్రో నోటీసులు ఇవ్వడంతో మీరు రానవసరం లేదు నేనే తొలగించుకుంటానని మురళీమోహన్ ప్రకటన చేయడం ప్రస్తుతం ఆసక్తికర చర్చకు కారణంగా మారింది. అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో సినిమా సెలబ్రిటీలంతా సెట్ అయ్యారని, హైడ్రా కూల్చివేతలను ఆపడం ఎవరి తరం కాదని అర్థం చేసుకున్నారని చర్చ జరుగుతుంది.

హైడ్రా నోటీసులు ఇచ్చినా జీ హుజూర్ అనాల్సిందే
హైడ్రా అధికారులు కూల్చివేతలు జరిపితే అనవసరంగా పరువు పోతుందని భావించి ఇప్పుడు హైడ్రా ఇస్తున్న ఆదేశాలకు జీ హుజూర్ అనడం తప్ప మరేమీ ప్రత్యామ్నాయం లేదని అంటున్నారు. హైడ్రా చర్యల పైన ధిక్కారస్వరం వినిపించడానికి, కోర్టు వేదికగా తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నా హైడ్రా మాత్రం అవేవీ పట్టించుకోకుండా కూల్చివేతలకు పాల్పడుతూనే ఉండడంతో ఇక ఏం చేసినా కూల్చివేతలు ఆగవు అని భావిస్తున్న క్రమంలోనే బడా బాబులు సైతం సైలెంట్ అవుతున్నారని ప్రస్తుతం తెలంగాణలో చర్చ జరుగుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+