గులాబీ గూటికి నామా : కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్
హైదరాబాద్ : తెలంగాణ గడ్డపై చేరికల పర్వం కొనసాగుతోంది. అధికార టీఆర్ఎస్‌లో వలస ప్రవాహాం కొనసాగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరగా, ఒక టీడీపీ ఎమ్మెల్యే, ఇండిపెండెంట్లు కూడా కారెక్కారు. వీరేకాకుండా ముఖ్యనేతలు కూడా గులాబీ కండువా కప్పుకునేందుకు పోటీపడుతున్నారు. ఇవాళ టీడీపీ నేత నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్ పార్టీలో చేరారు.

సైకిల్ వీడి .. కారెక్కారు
ఇటీవలే టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పొలిట్ బ్యూరో పదవీకి రాజీనామా చేసిన నామా నాగేశ్వరరావు గురువారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నామాకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. నామాతోపాటు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు స్వర్ణకుమారి, అమర్‌నాథ్, ఖమ్మం జిల్లా టీడీపీ అధ్యక్షుడు బ్రహ్మయ్య, మంచిర్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు శరత్ బాబు కూడా టీఆర్ఎస్ తీర్థం పుచుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌తోపాటు తదితరులు పాల్గొన్నారు.

నామాకు సముచిత ప్రాధాన్యం ?
టీఆర్ఎస్‌లో చేరిన నామాకు పార్టీలో సముచిత ప్రాధాన్యం దక్కనున్నట్టు తెలుస్తోంది. ఖమ్మం సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్థానంలో టికెట్ ఇవ్వనున్నట్టు సమాచారం. పార్టీలో చేరే ముందే టికెట్ల అంశంపై స్పష్టత తీసుకున్నాకే .. చేరిక ప్రక్రియ రంగం సిద్ధం చేసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం
దూరంగా తుమ్మల
ఖమ్మం జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ముఖ్య నేత తుమ్మల నాగేశ్వరరావు .. నామా నాగేశ్వరరావు పార్టీలో చేరిక కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. వీరిద్దరి నేతలకు ఒకరంటే ఒకరికి గిట్టదని తెలిసిందే. గతంలో టీడీపీలో కలిసి పనిచేసి ... ఇప్పుడు టీఆర్ఎస్‌లో చేరడం ఆసక్తి రేపుతోంది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications