తెలంగాణలో 2.5 లక్షలకు చేరువగా కరోనా: తగ్గుతోన్న డిశ్చార్జీలు: పేషెంట్ల సంఖ్యలో అనూహ్యం

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. కొత్త కేసుల వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇదివరకు నమోదైన రోజువారీ కేసులతో పోల్చుకుంటే వాటి సంఖ్య తగ్గినప్పటికీ.. స్థిరంగా ఉంటున్నాయి. కరోనా వైరస్ బారిన పడి కోలుకుంటోన్న వారి సంఖ్య అనూహ్యంగా తగ్గుముఖం పట్టడం ఆందోళనకరంగా పరిణమించింది. ఇదివరకు- రెండు వేలకు పైగా డిశ్చార్జీలు నమోదవుతుండగా.. కొద్దిరోజుల ఈ సంఖ్య వెయ్యికి దిగువగా చేరింది. ఫలితంగా- యాక్టివ్ కేసులు క్రమంగా పెరుగుతూ పోతున్నాయి.

తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,602 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నలుగురు మరణించారు. 982 మంది మాత్రమే సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,47,284కు చేరుకుంది. ఈ సంఖ్య క్రమంగా రెండున్నర లక్షలకు చేరువ అవుతోంది. ఇందులో డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2,26,646గా నమోదైంది. కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 1366కు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్‌గా ఉన్న కేసులు 19,272గా నమోదు అయ్యాయి. గృహాలు, ఇన్‌స్టిట్యూషనల్ ఐసొలేషన్‌లో 16,522 మంది చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

Newly 1602 Covid19 positive cases and 4 deaths reported in Telangana last 24 hours

గ్రేటర్ హైదరాబాద్‌లో కొత్తగా 295 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఆదిలాబాద్-17, భద్రాద్రి కొత్తగూడెం-77, జగిత్యాల-39, జనగామ-17, జయశంకర్ భూపాలపల్లి-23, జోగుళాంబ గద్వాల-11, కామారెడ్డి-28, కరీంనగర్-76, ఖమ్మం-79, కొమరంభీమ్ ఆసిఫాబాద్-13, మహబూబ్ నగర్-32, మహబూబాబాద్-19, మంచిర్యాల-39, మెదక్-21, మేడ్చల్ మల్కాజ్‌గిరి-137, ములుగు-43, నాగర్ కర్నూలు-47, నల్లగొండ-79, నారాయణపేట్-1, నిర్మల్-12, నిజామాబాద్-33, పెద్దపల్లి-46, రాజన్న సిరిసిల్ల-27, రంగారెడ్డి-118, సంగారెడ్డి-40, సిద్ధిపేట్-38, సూర్యాపేట్-45, వికారాబాాద్-18, వనపర్తి-24, వరంగల్ రూరల్-26, వరంగల్ అర్బన్-49, యాదాద్రి భువనగిరి-33 కేసులు నమోదు అయ్యాయి.

తెలంగాణ వ్యాప్తంగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు మళ్లీ పుంజుకున్నాయి. 24 గంటల్లో 46,970 శాంపిళ్లను పరీక్షించినట్లు అధికారులు తమ తాజా బులెటిన్‌లో వెల్లడించారు. ఇప్పటిదాకా పరీక్షించిన శాంపిళ్ల సంఖ్య 45,31,153కు చేరుకుంది. ప్రతి 10 లక్షల మంది జనాభాకూ 1,21,739 టెస్టులను నిర్వహించినట్లు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+