ఇవాళ్టి నుంచి నో ఒమిక్రాన్ బులెటిన్.. అంతా ఒక్కటే, 4 వారాలు కీలకం: డీహెచ్ శ్రీనివాస రావు

ఒమిక్రాన్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా కేసులతో.. ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. దేశంలో ఒమిక్రాన్ కేసులు 400 శాతం పెరిగాయని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌‌ డాక్టర్ శ్రీనివాసరావు అన్నారు. ఒమిక్రాన్ కేసుల పెరుగుదల అనేది.. మూడో వేవ్‌కి ప్రారంభం అని వివరించారు. ఢిల్లీలో అత్యధిక కేసులు నమోదయ్యాయని చెప్పారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరిలో విపరీతంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతోందని చెప్పారు.

సాధరణ లక్షణాలే

సాధరణ లక్షణాలే


రెండు రోజుల క్రితమే ఒమిక్రాన్ వ్యాప్తిపై సీఎం, మంత్రులు, అధికారులతో చర్చించారని.. రెగ్యులర్‌గా సమీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నాలుగు రోజుల్లో 4 రేట్లకు పైగా పాజిటివిటీ రేటు పెరుగుతోందని చెప్పారు. డెల్టా వేరియెంట్ కన్నా ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు. వ్యాధి వ్యాప్తి తీవ్రంగానే ఉందని, కాకపోతే సీరియస్ అవ్వడం లేదన్నారు. 90 శాతం మందిలో అసలు లక్షణాలే కనిపించడం లేదన్నారు. మరో 10 శాతం మందిలో కూడా సాధారణ లక్షణాలే ఉన్నాయని అన్నారు.

విధిగా పరీక్ష

విధిగా పరీక్ష


వ్యాధి లక్షణాలు ఉంటే తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని డైరెక్టర్ శ్రీనివాసరావు సూచించారు. డెల్టాలో పాజిటివ్ వచ్చిన 3 రోజుల తరువాత లక్షణాలు బయటపడ్డాయని, కానీ ఒమిక్రాన్ అలా కాదన్నారు. వైరస్ సోకిన సంగతి తెలియకుండానే వ్యాధి వ్యాప్తి వేగంగా జరుగుతుందని హెచ్చరించారు. సాధారణ లక్షణాలు ఉన్నవారు ఆస్పత్రుల్లో అడ్మిట్ కావొద్దని సూచించారు. సీరియస్ ఉన్నవాళ్లు మాత్రమే ఆస్పత్రులకు వెళ్లాలని సూచించారు. అనవసరంగా ఆస్పత్రులకు వెళ్లి బెడ్స్ హోల్డ్ చేయరాదని, ఆక్సిజన్ సాచురేషన్ తక్కువగా ఉంటేనే అడ్మిట్ కావాలని డాక్టర్ శ్రీనివాసరావు సూచనలు చేశారు.

అడ్మిట్ చేసుకోవద్దు..

అడ్మిట్ చేసుకోవద్దు..


ఒమిక్రాన్ స్వల్ప లక్షణాలు ఉన్న బాధితులను అనవసరంగా ఆస్పత్రుల్లో అడ్మిట్ చేసుకోవద్దని ప్రైవేట్ హాస్పిటల్స్‌కి డీహెచ్ శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. ప్రైవేటు ఆస్పత్రులు తప్పనిసరిగా కోవిడ్ ట్రీట్‌మెంట్ ప్రోటోకాల్ పాటించాలని సూచించారు. అనవసర మెడిసిన్ వాడకూడదని తెలిపారు. ఒమిక్రాన్‌పై కాక్ టయిల్ కూడా పనిచేయడం లేదని తేలిందన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ వారికి వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేస్తున్నట్టు చెప్పారు. ఒమిక్రాన్ భయంతో ఆస్పత్రులకు వచ్చే ప్రజల్ని భారంలోకి నెట్టవద్దని డీహెచ్ శ్రీనివాసరావు సూచించారు.

4 వారాల్లో భారీగా కేసులు

4 వారాల్లో భారీగా కేసులు

నాలుగు వారాలుగా ఒమిక్రాన్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. నెలాఖరులోగా ఒమిక్రాన్ వ్యాపి మరింత పెరిగే అవకాశం లేకపోలేదని డీహెచ్ శ్రీనివాసరావు హెచ్చరించారు. ఫిబ్రవరిలోగా భారీగా కొవిడ్ కేసులు నమోదయ్యే ఛాన్స్ ఉందన్నారు. ఫిబ్రవరి చివరికి లోయస్ట్‌కి పడిపోయే ఛాన్స్ ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే చాలా నష్టపోతామని హెచ్చరించారు. అనవసరంగా జన సమూహాల్లోకి వెళ్లకూడదని, మాస్క్ మరువకూడదు.. వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకోవాలని సూచనలు చేశారు. కోవిడ్ ఐసోలేషన్ కిట్స్ పంపిణీ చేస్తున్నామని చెప్పారు.

గాదరింగ్స్ లేకుండా చూసుకోవాలి..

గాదరింగ్స్ లేకుండా చూసుకోవాలి..


గాదరింగ్స్ లేకుండా చూసుకోవాలని డీహెచ్ శ్రీనివాసరావు సూచించారు. రాజకీయ పార్టీలు వచ్చే నాలుగు వారాలు ఎలాంటి కార్యక్రమాలు ఉన్నా రద్దు చేసుకోవాలని సూచించారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయని.. ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని అన్నిరకాలు ప్రోగ్రామ్స్ రద్దు చేసుకోవాలని డీహెచ్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం ప్రభుత్వం పెడుతున్న ఆంక్షలను ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలన్నారు. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు 101 శాతం పూర్తి అయ్యిందన్నారు. సెకండ్ డోస్ 71 శాతం మాత్రమే పూర్తి అయ్యిందని చెప్పారు.

కొత్త నిబంధనలు

కొత్త నిబంధనలు


ఒమిక్రాన్ కేసుల పెరుగుదల నేపథ్యంలో కొత్త కొవిడ్ నిబంధనలేమి ఉండవన్నారు. ప్రస్తుతమున్న నిబంధనలే వర్తిస్తాయని చెప్పారు. అవే కొవిడ్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాల్సిందిగా సూచించారు. సరిహద్దుల్లో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉందన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ కమ్యూనిటీలోకి వచ్చేసిందన్నారు. ఒమిక్రాన్ కేసులపై ప్రత్యేక బులిటెన్ ఉండదని.. అన్ని కేసులు ఒక్కటేనన్నారు. అన్ని పీహెచ్‌సీలలో కోవిడ్ క్లినిక్స్ ప్రారంభించామని చెప్పారు. హోమ్ కిట్ అందిస్తున్నామని, ఫీవర్ సర్వే కూడా కొనసాగుతుందని డీహెచ్ శ్రీనివాసరావు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+