మళ్లీ వాన: మూడురోజులు, తేలికపాటి జల్లులు
ఈ ఏడాది సమృద్దిగా వర్షాలు కురిసాయి. వాగులు, వంకలు నిండిపోయాయి. చెరువుల్లో జలకళ సంతరించుుంది. మత్తడి దుంకడంతో తెలంగాణ హరితంగా మారింది. సిటీలో కూడా వర్ష ప్రభావం ఉంది. నదులు, ప్రాజెక్టులు నిండాయి. అయితే మరో మూడు రోజులు వర్షం కురుస్తోందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తేలికపాటి జల్లులు కురుస్తాయని వివరింాచరు.
రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడిందని, సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని పేర్కొంది. ఆవర్తనం పశ్చిమ - వాయువ్య దిశగా ప్రయాణించి.. రేపటి వరకు ఉత్తర ఒడిశా, బెంగాల్ తీరాలకు చేరుకునే అవకాశం ఉందని చెప్పింది. పశ్చిమ దిశగా రాష్ట్రంలోకి కిందిస్థాయి గాలులు వీస్తున్నాయని తెలిపింది.
శుక్ర, శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆదివారం ఉరుములు, మెరుపులతో వర్షం పడుతుందని, ఈ నెల 20, 21న ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. పంట చివరి దశకు వచ్చిన సమయంలో వర్షం కాస్త ఇబ్బంది కరమే.. దీంతో పంటలపై ప్రభావం ఉంటుందా అనే సందేహాలు నెలకొన్నాయి.

ఆగస్టు చివరి వారంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా వర్షాలు కురిశాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లాయి. వర్షాల దాటికి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాల దాటికి పలు చోట్ల నీరు రోడ్లపైకి చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఆ తర్వాత పరిస్థితులు మెరుగుపడ్డాయి. సెప్టెంబర్ చివరికీ వచ్చిన వర్ష ప్రభావం ఉంటుంది. వినాయక చవితి రోజున వర్షం లేనందువల్ల.. నిమజ్జనం సమయంలో వరుణ దేవుడు కురుస్తున్నాడా అనే సందేహాం కలుగుతుంది. అయితే ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలంగా ఉన్నాయి. వైరల్ ఫీవర్, డెంగ్యూ ఎఫెక్ట్ ఉంది. ఈ క్రమంలో వర్షాల వల్ల జ్వరాలు పెరిగే ఛాన్స్ ఉంది.












Click it and Unblock the Notifications