కరోనా ఉధృతి: తెలంగాణలో నైట్ కర్ఫ్యూను పొడిగిస్తూ సర్కారు నిర్ణయం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు మరింతగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న రాష్ట్ర వ్యాప్త రాత్రిపూట కర్ఫ్యూను మరో వారం రోజులు పొడిగించింది. మే 8 వరకు ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది.

నైట్ కర్ఫ్యూ సరైన నిర్ణయమే..

నైట్ కర్ఫ్యూ సరైన నిర్ణయమే..

కరోనా విజృంభిస్తున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 20వ తేదీ నుంచి ఏప్రిల్ 30 వరకు రాత్రిపూట కర్ఫ్యూ విధించింది. ఈ రోజుతో నైట్ కర్ఫ్యూ గడువు ముగుస్తుండటంతో తాజా నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా కేసులు మరింతంగా పెరుగుతుండటంతో నైట్ కర్ఫ్యూ పొడిగించడమే సరైన చర్య అని భావించింది తెలంగాణ సర్కారు.

హైకోర్టు హెచ్చరికల నేపథ్యంలో తక్షణమే..

హైకోర్టు హెచ్చరికల నేపథ్యంలో తక్షణమే..

కాగా, రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. నైట్ కర్ఫ్యూ తర్వాత కరోనా కట్టడికి చర్యలు ఏం తీసుకుంటున్నారో సర్కారు తెలపకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 45 నిమిషాల్లోనే వివరాలు తెలపాలని అడ్వకేట్ జనరల్ ను కోర్టు ఆదేశించింది. అంతేగాక, ప్రభుత్వం చెప్పకపోతే తామే ఆదేశాలు ఇస్తామని హెచ్చరించింది. ప్రభుత్వ విధుల్లో జోక్యం చేసుకోవడం మా ఉద్దేశం కాదని తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు నైట్ కర్ఫ్యూ పొడిగిస్తున్నట్లు శుక్రవారం మధ్యాహ్నం ప్రకటించింది.

నైట్ కర్ఫ్యూ పొడిగింపు ఉత్తర్వులు జారీ

నైట్ కర్ఫ్యూ పొడిగింపు ఉత్తర్వులు జారీ


ప్రభుత్వ నిర్ణయం మేరకు ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కర్ఫ్యూ పొడిగింపు ఉత్తర్వులను జారీ చేశారు. ఆ తర్వాత కోర్టుకు నైట్ కర్ఫ్యూ విధించినట్లు తెలిపింది.
23ఇంకా రాష్ట్రంలో ఏమైనా ఎన్నికలు జరగాల్సి ఉన్నాయా? అని ప్రశ్నించగా.. లేవని అడ్వకేట్ జనరల్ తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వులను పరిగణిలోకి తీసుకున్న కోర్టు.. తదుపరి విచారణనను మే 5కు వాయిదా వేసింది. కాగా, ఇప్పటికే కరోనా కట్టడి విషయంలో తెలంగాణ సర్కారుపై పలుమార్లు కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

తెలంగాణలో కొత్తగా 7646 కరోనా కేసులు, 53 మంది మృతి

తెలంగాణలో కొత్తగా 7646 కరోనా కేసులు, 53 మంది మృతి


కాగా, తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 7646 కరోనా కేసులు నమోదు కాగా, 53 మంది మరణించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శుక్రవారం బులిటెన్లో తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 4,35,606కు చేరుకుంది. ఇప్పటి వరకు 3,55,618 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనాతో రాష్ట్రంలో 2261 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 77,727 యాక్టివ్ కేసులున్నాయి. అత్యధికంగా హైదరాబాద్‌లో 1441, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 631, రంగారెడ్డిలో 484, సంగారెడ్డిలో 401, నిజామాబాద్‌లో 330, నల్గొండలో 285, సిద్దిపేటలో 289, సూర్యాపేటలో 283, మహబూబ్ గనర్ 243, జగిత్యాల 230 కేసులు నమోదయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+