కరోనా వ్యాప్తిపై తెలంగాణా జిల్లాల్లో సర్వే ... ఎన్ఐఎన్, తెలంగాణా సర్కార్ సంయుక్త నిర్వహణ
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో వివిధ జిల్లాల్లో కరోనా ప్రభావం ఏవిధంగా ఉంది అన్న విషయం పై జాతీయ పోషకాహార సంస్థ, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా సర్వే నిర్వహిస్తుంది. నల్గొండ, కామారెడ్డి ,జనగామ జిల్లాలలో మూడు రోజుల పాటు ఈ సర్వే నిర్వహించనున్నారు. మొత్తం 1200 మంది నుండి నమూనాలు సేకరించి సర్వే చేయనున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని ఈ సర్వే ద్వారా అంచనా వేయనున్నారు.
దేశ ప్రజల్లో కరోనా వైరస్ వ్యాప్తి , దాని తీరు తెన్నులు తెలుసుకోవడం కోసం ఐసీఎంఆర్ చేపట్టిన సర్వేలో భాగంగా జాతీయ పోషకాహార సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోనూ సర్వే కొనసాగుతుంది. నల్గొండ ,కామారెడ్డి , జనగామ జిల్లాలలో ప్రాథమిక దశ సర్వే నిర్వహించారు. కరోనా వైరస్ కేసులు ఒక్కొక్కటిగా నమోదవుతున్న తొలిరోజుల్లో నిర్వహించిన సర్వే సమయంలో జనగామలో రెండు కేసులు, కామారెడ్డి నల్గొండ జిల్లాలో ఒక కేసు చొప్పున నమోదయ్యాయి.

ప్రస్తుతం రెండవ దశలో ఒక్కో జిల్లాలో 10 గ్రామాలను ఎంపిక చేసి సర్వే నిర్వహించనున్నారు. మొత్తం 1200 మంది నుంచి సొమ్ము నమూనాలు సేకరించి కరుణ వైరస్ ఏమేరకు వ్యాప్తి చెందింది. ఏ వయసు వారిలో ఎక్కువగా వ్యాప్తి కనిపిస్తుంది. ప్రాథమిక సర్వే అప్పుడు పరిస్థితి ,ఇప్పుడు సర్వే నిర్వహించే నాటి పరిస్థితికి తేడా ఏంటి ? వంటి అనేక అంశాలను పరిశీలిస్తారు. జనగామ నల్గొండ కామారెడ్డి జిల్లాలో 5 శాతం మేరకు వ్యాప్తి జరిగినట్లు సర్వేలో నిర్ధారణ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా ప్రాథమిక అంచనా. ఐదుగురు సభ్యులు చొప్పున పదిహేను బృందాలతో మూడు రోజులపాటు సర్వే నిర్వహించి వ్యాప్తిపై సర్వే ఆధారంగా, ఒక అంచనాకు వస్తామని జాతీయ పోషకాహార సంస్థ నుండి సర్వే కొరకు వచ్చిన యంత్రాంగం చెబుతోంది. తెలంగాణ ప్రభుత్వం కూడా వీరితో కలిసి సంయుక్తంగా, కరోనా వ్యాప్తి పై సర్వేను కొనసాగిస్తోంది.
Recommended Video
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications