కుమారి ఆంటీ కోసం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం?

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు కొత్తగా ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, టన్నెళ్లు నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించిన సంగతి తెలిసిందే. సీఎం ఆదేశాల మేరకు హైదరాబాద్ లో కొత్తగా 5 టన్నెల్స్ ను గ్రేటర్ హైదరాబాద్ నిర్మించబోతోంది. వీటి నిర్మాణం సాధ్యాసాధ్యాలపై డీపీఆర్ కోసం టెండర్లను పిలిచింది. టన్నెల్ బోరింగ్ మెషిన్లను ఉపయోగించి ఈ సొరంగాలను ఐదు కీలకమైన కారిడార్లలో నిర్మించబోతున్నారు.

ITC కోహినూర్- విప్రో సర్కిల్ వయా ఖాజాగూడ, నానక్‌రాం గూడ వరకు, ITC కోహినూర్ - జేఎన్‌టీయూ వయా మైండ్ స్పేస్ వరకు మరో టెన్నెల్, ITC కోహినూర్- బంజారాహిల్స్ రోడ్ నెంబర్10 వయా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్- 45 వరకు, జీవీకే 1 మాల్ -నానల్‌నగర్ వయా మాసబ్ ట్యాంక్ వరకు, నాంపల్లి - చాంద్రాయణగుట్ట ఐఆర్ఆర్ వయా చార్మినార్, ఫలక్‌నుమా వరకు మరో టెన్నెల్ ను అధికారులు ప్రతిపాదించారు. వీటివల్ల ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని భావిస్తున్నారు. అంతేకాకుండా హైదరాబాద్ అంతటా కనెక్టివిటీ మెరుగుపడనుంది.

no more traffic at kumari aunty food stall because government five road tunnels going to build

ఐటీసీ కోహినూర్ నుంచి టన్నెళ్ల నిర్మాణంతో కుమారీ అంటీ ఫుడ్ స్టాల్ వద్ద ట్రాఫిక్ రద్దీ తగ్గబోతోంది. అక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో ఆమె ఫుడ్ స్టాల్ ను పోలీసులు మూయించారు. సోషల్ మీడియాలో ఆమె ఆవేదన వ్యక్తం చేయడంతో వెంటనే ఆమె స్టాల్ ను తెరిపించాలంటూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయి. త్వరలోనే కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ను సీఎం రేవంత్ సందర్శించబోతున్నారు. అక్కడ టన్నెల్ నిర్మించనుండటంతో ఆమె ఫుడ్ స్టాల్ కు ఎటువంటి ఆటంకం ఏర్పడకుండా, ట్రాఫిక్ రద్దీ లేకుండా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనివల్ల నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువలా వస్తున్నాయి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక చిన్న ఫుడ్ స్టాల్ మూతపడకుండా ఉండేందుకు, అటువంటివారు ఉపాధి కోల్పోకుండా ఉండేందుకు నగరమంతటా నిర్మించనుండటంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అందరూ కొనియాడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+