హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ సర్ చెప్పిన వినలే, భౌతికదూరం పాటించలే.. యథేచ్చగా నిబంధనల ఉల్లంఘన

|
Google Oneindia TeluguNews

ఒకటి కాదు రెండు కాదు 40 రోజులకుపైగా వైన్ షాపులు మూసివేసి ఉన్నాయి. బుధవారం లిక్కర్ షాపులు తెరవడంతో జనాలు బారులుతీరారు. అయితే చాలాచోట్ల భౌతికదూరం పాటించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. దూరం ఉండాలని, సర్కిళ్లు గీసిన దాంట్లో... జనాలు మాత్రం దగ్గరగా నిల్చొని ఉన్నారు. నో మాస్క్, నో లిక్కర్ అని ఎక్సైజ్ శాఖ ప్రకటించినా.. చాలా చోట్ల కొందరు మాస్క్ వేసుకోకుండా కూడా కనిపించిన దాఖలాలు ఉన్నాయి.

ఉల్లంఘన...

ఉల్లంఘన...

హైదరాబాద్ చింతల్ గణేశ్ నగర్ వద్ద గల వైన్ షాప్ వద్ద జనాలు నిల్చొన్నారు. అయితే ఒకరికొకరు అంటుకునేంత దగ్గరగా వీడియోలో కనిపించింది. వైన్ షాప్ వద్ద ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్న భౌతికదూరం పాటించడంలో విఫలమయ్యారనే చెప్పాలి. పదుల సంఖ్యలో మందుబాబులు.. భౌతికదూరం పాటించకుంటే ఎలా అని ప్రశ్న తలెత్తుతోంది. సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాప్ ఓపెన్ చేసి ఉండటంతో.. లిక్కర్ షాపుల వద్ద జనం కనిపించారు. ఇక్కడ రెండు లైన్లను ఏర్పాటుచేసినా.. జనం మాత్రం ఫిజికల్ డిస్టన్స్ మాట మరిచారు.

లైసెన్స్ రద్దు..?

లైసెన్స్ రద్దు..?

మంగళవారం రాత్రి ప్రెస్‌మీట్‌లో సీఎం కేసీఆర్.. లిక్కర్ షాపు యజమానులను హెచ్చరించారు. భౌతికదూరం, మాస్క్‌లు వేసుకొన్నవారికే లిక్కర్ విక్రయించాలని స్పష్టంచేశారు. ఆదేశాలను ఉల్లంఘించిన వారికి సంబంధించి ఫుటేజీ ఇవ్వాలని మీడియా ప్రతినిధులను కోరారు. వెంటనే వారి లైసెన్స్ రద్దు చేస్తామని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. కానీ సీఎం ఆదేశాలను అటు మందుబాబులు.. ఇటు లిక్కర్ షాపు యాజమాన్యం ఉల్లంఘించింది.

Recommended Video

AP CM Jagan Launched Fishermen Bharosa Scheme, Rs 10,000 To Beneficiaries

ఎందుకు తెరిచామంటే..?

తెలంగాణ చుట్టూ ఉన్న 4 రాష్ట్రాలు వైన్ షాపులు తెరిచాయని.. అందుకే తెలంగాణలో తెరవాల్సిన పరిస్థితి ఏర్పడిందని కేసీఆర్ స్పష్టంచేశారు. లేదంటే ఇతర రాష్ట్రాల నుంచి స్మగ్లింగ్ జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇప్పటికే గుడుంబా వాసన వినిపిస్తోందని.. మళ్లీ అలాంటి పరిస్థితి రావొద్దని కేసీఆర్ చెప్పారు. లైసెన్స్ కోసం కోట్ల రూపాయలు ఖర్చుచేశామని డిస్టలరీ కంపెనీలు కూడా చెబుతున్నాయని.. అందుకే వైన్ షాపులను తెరిచేందుకు అనుమతిచ్చామని కేసీఆర్ తెలిపారు.

English summary
no physical distance in some liquor shops in hyderabad. especially chintal wineshop break the rules.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X