శిఖాచౌదరితో ప్రేమ, రూ.1.5 కోట్లు ఖర్చు.. ఏం జరిగిందంటే!: రాకేష్‌రెడ్డి, జయరాం రూ.10 కోట్ల ఆఫర్‌కు నో
హైదరాబాద్: ఎన్నారై వ్యాపారవేత్త జయరాం హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. రూ.కోటిన్నర విలువచేసే శిఖా చౌదరి (జయరాం మేనకోడలు) కారును నిందితుడు రాకేష్ రెడ్డి తీసుకు వెళ్లాడు. తన కారును తీసుకు వెళ్లిన విషయాన్ని శిఖా.. జయరాంకు చెప్పింది. దీంతో శిఖా కోసం ఖర్చు చేసిన డబ్బులు తాను ఇస్తానని జయరాం అంగీకరించినట్లుగా తెలుస్తోంది. దీంతో తనకు రూ.4.5 కోట్లు ఇవ్వాలని రాకేష్ రెడ్డి డిమాండ్ చేశాడు. ఐదు నెలల నుంచి డబ్బు కోసం జయరాం వెంటపడ్డాడు.

జయరాం వచ్చిన విషయం తెలిసి హానీట్రాప్
జయరాం హైదరాబాదుకు వచ్చిన విషయం తెలిసి హానీట్రాప్ చేశాడు. అంతేకాదు, చాలా రోజులుగా జయరాం, శిఖా చౌదరి ఇళ్ల వద్ద రాకేష్ రెడ్డి నిఘా పెట్టాడని పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. జయరాంను హానీ ట్రాప్ ద్వారా తన ఇంటికి రప్పించుకొని, ఇంట్లోనే దాదాపు ఒకరోజు పాటు బంధించాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో దాడి చేశాడు.

రూ.10 కోట్ల జయరాం ఆఫర్
తనను వదిలి పెడితే రూ.10 కోట్లు ఇస్తానని జయరాం చెప్పాడు. దానికి రాకేష్ రెడ్డి స్పందిస్తూ.. నిన్ను చంపితే నాకు రూ.100 కోట్లు వస్తాయని చెప్పినట్లుగా తెలుస్తోంది. మీ ఆస్తులపై కోర్టులో లిటిగేషన్ పెట్టి డబ్బులు దండుకుంటానని హెచ్చరించాడట. లిటిగేషన్ ఆస్తుల సెటిల్మెంట్‌కు పద్మశ్రీతో డబ్బులు మాట్లాడుకుంటామని చెప్పాడట. జయరాం ఇస్తానన్న రూ.10 కోట్ల ఆఫర్‌ను పక్కన పెట్టి హత్య చేశానని రాకేష్ రెడ్డి కూడా పోలీసుల విచారణలో అంగీకరించాడని తెలుస్తోంది.

శిఖా చౌదరిని ప్రేమించా, రూ.1.5 కోట్లు ఖర్చు చేశా, అందుకే
తాను శిఖా చౌదరిని ప్రేమించానని రాకేష్ రెడ్డి పోలీసుల విచారణలో చెప్పాడని తెలుస్తోంది. తన ప్రేమ కోసం ఆమెకు రూ.1.5 కోట్లు ఖర్చు చేశానని కూడా చెప్పాడని తెలుస్తోంది. ఐదు నెలల క్రితం రాకేష్‌కు శిఖా చౌదరి బ్రేకప్ చెప్పింది. బ్రేకప్ అనంతరం ఖర్చు చేసిన డబ్బుల కోసం పట్టుబట్టాడు. రూ.కోటిన్నర కోసం శిఖా చౌదరి కారును తీసుకెళ్లాడు. ఈ విషయం ఆమె జయరాంకు చెప్పడం, ఆయన జోక్యం నేపథ్యంలో ఇక్కడి వరకు వచ్చినట్లుగా రాకేష్ రెడ్డి చెప్పినట్లుగా తెలుస్తోంది.

ఎవరైనా హత్య చేయించారా, కొత్త డ్రామానా
రాకేష్ రెడ్డి మాటలపై పోలీసులు అనుమానిస్తున్నారు. రాకేష్ రెడ్డితో ఎవరైనా హత్య చేయించి ఉంటారనే కోణంలోను వారు విచారిస్తున్నారు. రాకేష్ రెడ్డి ప్రియురాలైన శిఖా చౌదరి పాత్ర కోణంలోను విచారిస్తున్నారని తెలుస్తోంది. హత్యపై కొత్త కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నందున రాకేష్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారా.. శిఖాకు రూ.1.5 కోట్లు ఖర్చు, తిరిగి రాబట్టుకోవడం కొత్త డ్రామానా అనే కోణంలో దర్యాఫ్తు చేయనున్నారు. ఇదిలా ఉండగా, ఈ కేసులో విశాల్ అనే వ్యక్తి కూడా కీలకంగా మారినట్లుగా పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. విశాల్ అనే వ్యక్తి పాత్ర పైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications