హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అంతా అనుకున్నట్టే జరుగుతోంది..!నివురుగప్పిన నిప్పులా ఓల్డ్ సిటీ..!కరోనా మెరుపుదాడి..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : భిన్న సంస్కృతులు సమాహారమైన హైదరాబాద్ నగరం ఉలిక్కిపడింది. కరోనా కట్టడిలో తెలంగాణ రాష్ట్రం కట్టుదిట్టంగా వ్యవహరించిందనే చర్చ జరుగుతున్న సందర్బంలో కరోనా నగరంపైన మెరుపుదాడి చేసింది. ఎవ్వరూ ఊహించని రీతిలో రెచ్చిపోయింది. ఒక్కరోజులోనే వందకు చేరువలో కేసులు నమోదు కావడం పట్ల యంత్రాంగం నెవ్వరపోయింది. నగరం మొత్తంలో లాక్‌డౌన్ ఆంక్షలు కఠినంగా అమలవుతుంటే ఒక్క పాత నగరంలో మాత్రం పరిస్దితులు వేరుగా ఉన్నాయనే చర్చ జరిగింది. పాత నగరంలోని వివిధ కాలనీలవారు ఎవరికి వారు రోడ్లను బ్లాక్ చేసుకుని కనీసం పోలీసులు వెళ్లడానికి కూడా సాద్యం కాని పరిస్థితులను కల్పించుకున్నారు.

పాతనగరంలో ఏం జరుగుతోంది..

పాతనగరంలో ఏం జరుగుతోంది..

దీంతో పాతనగరంలో కరోనా వ్యాప్తి, కేసుల నిర్దారణ, పాజిటీవ్ కేసుల సంఖ్య పట్ల అయోమయం నెలకొంది. పరిస్థితిని సమీక్షించడానికి అదికారులు చేసిన ప్రయత్నాలను అక్కడి వారు అడ్డుకున్న ఉదంతాలు ఉన్నాయి. దీంతో నివురుగప్పిన నిప్పులా కనిపిస్తున్న పాత నగరంనుండి ఎలాంటి చేదు వార్త వినాల్సొందోనని అధికారులు ఆందోళన వ్యక్తం చేసిన సందర్బలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అదే నిజమైంది. పిడుగులాంటి వార్తతో భాగ్య‌న‌గ‌రాన్ని ఓల్డ్ సిటీ భ‌య‌భ్రాంతులకు గునిచేసే పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో పాతనగరానికి ఆనుకుని ఉన్న కాలనీ వాసుల‌కు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది పాత నగరం.

రహదారులను దిగ్బందించుకున్న ఓల్డ్ సిటీ వాసులు..

రహదారులను దిగ్బందించుకున్న ఓల్డ్ సిటీ వాసులు..

క‌రోనా వైర‌స్ దేశంలో రోజురోజుకూ వేగంగా వ్యాపిస్తోంది. ఏప్రిల్ నెల‌తో పాటు మే మొదటి వారంలో కాస్త శాంతించిన క‌రోనా వ్యాప్తి రెండో వారంనుండి విజృంభిస్తోంది. మే రెండవ వారంనుండి మాత్రం వైర‌స్ వ్యాప్తి విప‌రీతంగా ఉంద‌ని కేంద్రం వెల్ల‌డించింది. ఏప్రిల్ నెల‌లో రోజుకు స‌గ‌టున 1,073 కేసులు న‌మోదు కాగా, మే 11వ తేదీన నాటికి రోజుకు స‌గ‌టున 3,409 కేసులు న‌మోద‌య్యాయ‌ని నిర్ధారిస్తోంది. అంటే గ‌త నెల‌తో పోలిస్తే ఈ నెల‌లో క‌రోనా దాదాపు మూడు రెట్లు ఎక్కువ వేగంతో వ్యాపిస్తూ అంద‌రినీ భ‌య‌భ్రాంతులకు గురిచేస్తోంది.

డాక్టర్లకు, పోలీసులకు నో ఎంట్రీ..

డాక్టర్లకు, పోలీసులకు నో ఎంట్రీ..

ఇక తెలంగాణ‌లో వైర‌స్ వ్యాప్తి ఆందోళనకరంగా మారింది. కేసులు ఎక్కువ‌గా హైద‌రాబాద్ గ్రేట‌ర్ ప‌రిధిలోనే న‌మోదు కావ‌డం, పాత నగరం నుండి పాజిటీవ్ కేసుల పెరుగుదల ఆందోళ‌న క‌లిగిస్తోంది. గత కొద్ది రోజులుగా తెలంగాణ‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య కాస్త త‌గ్గిన‌ట్లుగా క‌నిపించినా మళ్లీ గణనీయంగా పెరుగుతోంది. సోమవారం ఒక్కరోజులోనే 79 కొత్త కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 21న 56 పాజిటివ్ కేసులు నమోదు కాగా, చాలా రోజుల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం విస్మయాన్ని కలిగిస్తోంది. కొత్తగా నమోదైన కేసులన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోవే కాగా, వీరిలో 13 మంది 15 ఏళ్లలోపు చిన్నారులు ఉన్నారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలోనే ఈ కేసులన్నీ నమోదయ్యాయి.

Recommended Video

TSRTC Buses Resume In Telangana
ఒక్కసారిగా బ్లాస్టయిన పాతనగరం..

ఒక్కసారిగా బ్లాస్టయిన పాతనగరం..

హైద‌రాబాద్ పాత‌బ‌స్తీలోని బేగం బజార్, గడ్డి అన్నారం, జియాగుడ, కిషన్‌బాగ్ ప్రాంతాల్లో కొత్త కేసులు నమోదైన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ఒక్క జియాగుడలోనే 26 కొత్త కేసులు నమోదయ్యాయని నిర్ధారణవుతోంది. పాత నగరంలో వైద్యుల, పోలీసులతో పాటు ఇతర అదికారలు ఎవ్వరూ వెళ్లకుండా రహదారులను దిగ్బంధనం చేసుకున్నారు. దీంతో లోపల ఏం జరుగుతోంది..? జనాలు గుపులు గుంపులుగా చేరుతున్నారా..? సోషల్ డిస్టెన్స్ తోపాటు మాస్కులు ధరించారా అనే అంశాన్ని కూడా పసిగట్టలేకపోయారు అధికారులు. దీంతో ఆ ప్రాంతంలో కరోనా వ్యాప్తి ఎలా ఉందో గ్రహించడం కష్టంగా మారింది. సోమవారం ఒక్కరోజే దాదాపు 30కేసులు నమోదవ్వడంతో అధికారులు అవాక్కయ్యారు. ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న పాతనగరంలో పాజిటీవ్ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోవడంతో రాష్ట్రం ఉలిక్కి పడుతోంది.

English summary
The city of Hyderabad, a city of diverse cultures, was struck. Telangana state has been in the midst of a controversy over the coronation of the corporation. Something unexpectedly provoked. The mechanism surprised for the number of cases in one day has reached 100.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X