హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వావ్.. సజ్జనార్: ఆర్టీసీలో ఉద్యోగాల ప్రకటన.. ఆ రెండు విభాగాల్లో

|
Google Oneindia TeluguNews

ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ తన విధుల్లో నిమగ్నం అయ్యారు. ప్రయాణికుల సమస్యలను తెలుసుకుంటూనే.. ఇతర అంశాలపై ఫోకస్ చేశారు. ఇటీవల ఆర్టీసీ బస్సులో ప్రయాణం.. తర్వాత సంస్థకు ఆదాయంపై ఫోకస్ చేశారు. రాష్ట్రంలో దసరా సమయంలో సిటీ నుంచి జనం ఊర్లకు వెళుతుంటారు. అప్పుడు అదనపు చార్జీ లేకుండా బస్సులను నడిపించారు. అయినా మంచి ఆదాయమే సమకూరింది. ఇప్పుడు మరో కీలక ప్రకటన చేశారు. ఆర్టీసీలో కొన్ని విభాగాలకు కొలువులను ప్రకటించారు. అర్హులు దరఖాస్తు చేసుకోవాలని ట్వీట్ చేశారు.

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఉద్యోగాలు ప్రకటన జారీ అయ్యింది. ఇటీవలే ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు తీసుకున్న సజ్జనార్.. సంస్థను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటామని మాట ఇచ్చారు. ఆర్టీసీని పండుగ పూట లాభాల్లోకి తెచ్చారు. ఏటా పండుగ వేళ ఆర్టీసీకి లాభాలు వస్తున్నా కూడా... ఈసారి మరింత ప్లానింగ్‌తో ఆర్టీసీకి లాభాల శాతాన్ని పెంచిన సంగతి తెలిసిందే. ఆర్టీసీలో అవసరాన్ని బట్టి.. ఉద్యోగుల సంఖ్య పెంచుతాం.. లేదా తగ్గిస్తాం అని గతంలో చెప్పిన సజ్జనార్.. ఆ మాట ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. ఐటీఐ డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్ గ్రాడ్యుయేట్స్ కావలెను అంటూ ఓ ప్రకటన చేశారు.

openings on rtc md sajjanar post a tweet

హైదరాబాద్ రీజియన్‌లో గల 17 ఆర్టీసీ డిపోల్లో అప్రెంటిస్‌షిప్ చేయటానికి ఖాళీలు ఉన్నాయని సజ్జనార్ తెలిపారు. ఎంపికైన వారికి అప్రెంటిస్‌షిప్ టైంలో బస్ పాస్, స్టైపెండ్ సౌకర్యం కల్పిస్తామని వివరించారు. డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్ టేడ్స్‌లో ఉత్తీర్ణులైన గ్రాడ్యుయేట్స్ సంప్రదించాలని కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

Recommended Video

Telangana Govt కి కృతజ్ఞతలు తెలిపిన RTC సిబ్బంది!!

ఈ ప్రకటన తర్వాత మరిన్ని కొలువులు ఇచ్చే అవకాశం ఉంది. ఆయా విభాగాల్లో అర్హులను భర్తీ చేస్తారు. చెప్పినట్టుగానే సజ్జనార్ నడుచుకుంటున్నారు. ఖాళీలను భర్తీ చేస్తున్నారు. నిరుద్యోగ యువతకు ఛాన్స్ ఇస్తున్నారు. సజ్జనార్ చేసే మంచి పనితో యువతకు అవకాశం లభిస్తోంది. కొందరికీ ఉపాధి దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ యువతకు ఉపాధి అవకాశాలు కూడా అందజేస్తున్నారు.

English summary
openings on rtc md sajjanar post a tweet. diesel mechanic and motor mechanic posts in hyderabad region
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X