వేడుకల పేరుతో తిప్పి, కుళ్లిన ఆహారం.. పేరంట్స్ ఫైర్
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. జాతీయ సమైక్యత దినోత్సవాల పేరుతో వేడుకలను కూడా నిర్వహిస్తోంది. అయితే సికింద్రాబాద్‌లో తప్పిదం జరిగింది. అవును విద్యార్థులకు అందజేసిన ఆహారం కుళ్లిపోయింది. దీంతో వారు వాసన చూసి వదిలేశారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో ఎమ్మెల్యే సాయన్న ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. వేడుకల్లో పాల్గొన్న విద్యార్థులకు కుళ్ళిపోయిన భోజనాన్ని అందజేశారు. వాసన వస్తుండడంతో విద్యార్థులు కొద్దిగా తిని వదిలేశారు. ఎండలో ర్యాలీలో తిప్పి వారికి పాచిపోయిన ఆహారం పెట్టడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదీ మంచి పద్దతి కాదని తిట్టిపోస్తున్నారు.

వేడుకల కోసం ప్రభుత్వం లక్షల డబ్బులు కేటాయించగా.. స్థానిక నేతల కక్కుర్తి పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. కానీ నేతలు అధికారులు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా ఆహారాన్ని డస్ట్ బిన్‌లో వేశారు. అంతేకాదు వరి కంటపడకుండా విద్యార్ధులను కూడా పంపించేశారు.
సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా పాటించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజులపాటు జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల వేడుకలను జరుపుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 16వ తేది నుంచి 18 వరకు రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలను నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కానీ ఆ వేడుకల్లో ఇలా జరగడం కలకలం రేపుతుంది.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications