హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్కూళ్లకు సెలవులు లేవు.. పేరంట్స్ ఆందోళన చెందొద్దు: మంత్రి సబితా

|
Google Oneindia TeluguNews

విద్యాసంస్థల్లో కరోనా కేసులు వస్తోన్న సంగతి తెలిసిందే. గురుకుల పాఠశాలల్లో 10 పైచిలుకు పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తారా అనే డిస్కషన్ నడుస్తోంది. సెలవులు ఇస్తారని కొందరు ప్రచారం కూడా చేస్తున్నారు. దీంతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి క్లారిటీ ఇచ్చారు. అలాంటిదేం లేదు అని స్పష్టంచేశారు. పరిస్థితిని నిశీతంగా గమనిస్తున్నామని ఆమె వివరించారు.

కొన్ని హాస్టళ్లలోనే కేసులు వస్తున్నాయని.. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. కరోనా కేసులు పెరిగితే ప్రభుత్వం సమీక్షిస్తోందని చెప్పారు. అప్పుడు విద్యాసంస్థల క్లోజ్ చేయడంపై డిషిసన్ తీసుకుంటామని చెప్పారు. అందరూ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. టీచర్స్.. పేరంట్స్ కూడా రెండు డోసుల టీకా తీసుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. వ్యాక్సిన్ తీసుకొని.. కరోనాను జయించవచ్చని వైద్య నిపుణులు చెబుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి సబితా కూడా సజెస్ట్ చేశారు.

parents dont feared about corona cases at gurukulas

ఇటీవల విద్యా సంస్థల్లో కరోనా కేసులు ఎక్కువగా వస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో పేరంట్స్ ఆందోళన చెందుతున్నారు. ఆ క్రమంలోనే స్కూల్స్/ కాలేజీలు మూసివేస్తారని రూమర్లు వచ్చాయి. వాస్తవానికి ఇప్పుడే మార్కెట్ కుదుటపడుతోంది. అన్నీ వ్యాపార లావాదేవీలు పుంజుకుంటున్నాయి. ఇంతలోనే ఇలా కొత్తగా ఒమిక్రాన్ వేరియంట్ కరోనా రావడం.. రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడం కాస్త ఆందోళన కలిగిస్తోంది.

Recommended Video

Omicron Variant : Biological వార్‌ఫేర్‌ - Nations To Be Prepared || Oneindia Telugu

ఒమిక్రాన్ వైరస్ టెన్షన్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ గడ గడలాడించిన సంగతి తెలిసిందే. ఒమిక్రాన్ మూడో వేవ్ అనడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. అయితే వైరస్ నేపథ్యంలో ఒకటికీ రెండుసార్లు తనిఖీ చేయడం సహజమే.. కానీ కొందరు అవమాన పడాల్సి వస్తోంది. ఇటీవల లండన్ నుంచి వచ్చిన హైదరాబాదీ యువతి ఆ నిట్టూర్పు తప్పలేదు. ఇటు ఒమిక్రాన్ డెల్టా కంటే వేగంగా వ్యాపిస్తుంది. తీవ్ర ఒళ్ళు నొప్పులు, నీరసం, తలనొప్పి వంటి లక్షణాలు ఓమిక్రాన్ సోకిన వారికి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారికి ఒమిక్రాన్ వైరస్ సోకుతుంది.

English summary
parents dont feared about corona cases at gurukulas telangana minister sabitha indra reddy said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X