హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేవంత్ రిక్వెస్ట్: రెండురోజులు 4 లోపు రావొద్దు.. ప్లీజ్, ఫేస్‌బుక్‌లో పోస్ట్

|
Google Oneindia TeluguNews

రేవంత్ రెడ్డి బిజీ బిజీగా ఉన్నారు. అధ్యక్ష పదవీ ఇంకా అధికారికంగా చేపట్టకున్నా.. వరస భేటీలతో తీరిక లేకుండా ఉన్నారు. ఆయనను కలిసేందుకు వెల్ విషర్స్ వస్తున్నారు. అభినందనలు చెప్పేందుకు నేతలు, శ్రేణులు, అభిమానులు పోటెత్తుతున్నారు. వాస్తవానికి రేవంత్ రెడ్డికి టీ పీసీసీ అధ్యక్ష పదవీ ఇవ్వడంతో రాష్ట్రంలో కొంచెం పరిస్థితులు మారిపోయాయి. అందుకు తగ్గట్టు రేవంత్ రెడ్డిని నేతలు కలువడం.. కేసీఆర్, కేటీఆర్‌లను రేవంత్ ఏకీపారేయడం జరుగుతుంది. హుజురాబాద్ బై పోల్ రేవంత్ రెడ్డికి కీలకం కానుంది.

ఆ సమయంలో రావొద్దు

ఆ సమయంలో రావొద్దు

ఇక విషయానికి వస్తే.. తనను కలిసేందుకు దూరం నుంచి శ్రేణులు వస్తున్నందున రేవంత్ రెడ్డి వారికి ఒక వినతి చేశారు. బుధవారం, గురువారం ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ఉంది అని తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఆ రెండురోజులు ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు కలవడం వీలుపడదని చెప్పారు. దయచేసి అర్థం చేసుకోవాలని.. ఈ రోజులు సహకరించాలని కోరారు. తనను కలిసేందుకు వచ్చేవారు మాత్రం సాయంత్రం 4 గంటలు దాటిన తర్వాతే రావాలని కోరారు.

 4 తర్వాత ఓకే

4 తర్వాత ఓకే

రేవంత్ రెడ్డి పోస్ట్ చేయడం వల్ల సుదూరం నుంచి వచ్చేవారు ఆగే వీలుంది. ఒకవేళ సాయంత్రం అయినా ఫరావాలేదు అనుకుంటే వచ్చేవారు రావచ్చు. పీసీసీ చీఫ్ పదవీ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి తన మార్క్ పొలిటిక్స్ చేస్తున్నారు. అందరినీ కలుపుకొని పోతున్నారు. ఆస్పత్రిలో ఉన్న వీహెచ్‌ను పరామర్శించారు. తర్వాత కొండా దంపతులతో భేటీ, భారీ ర్యాలీతో సీతక్క రాక.. జానారెడ్డి, షబ్బీర్ అలీతో భేటీ అవుతూ.. పార్టీని మరింత బలోపేతం చేస్తున్నారు రేవంత్ రెడ్డి.

పరామర్శ

పరామర్శ

ఇటు సీతక్క తల్లి అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న సంగతి తెలిసిందే. ఆమెను రేవంత్ రెడ్డి పరామర్శించారు. బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట సీతక్క సహా ఇతర నేతలు ఉన్నారు. రేవంత్ రెడ్డి ఇలా వరసగా అందరీతో మమేకం అవుతున్నారు. కలుపుకొని పోయి.. పార్టీని మరింత బలోపేతం చేస్తున్నారు.

English summary
please.. not come before 4pm to meet tpcc chief revanth reddy asks to well wishers
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X