హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జన్ కీ బాత్ వినరు.. మాన్ కీ బాతే చెబుతారు, ఐటీ దాడులు జరగొచ్చు: మంత్రి కేటీఆర్

|
Google Oneindia TeluguNews

కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ ఫైరయ్యారు. ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థల చేత దాడులు చేయిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. తమపై ఈడీ దాడులు చేయించి, ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ దాడులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.

2024 ఎన్నికలే టార్గెట్

2024 ఎన్నికలే టార్గెట్


2024లో జరగబోయే లోక్ సభ ఎన్నికలే తమ టార్గెట్ పేర్కొన్నారు. ప్రస్తుతం పార్టీ పేరు మార్చామని, లోక్ సభ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారుతుందని తెలిపారు. దేశంలో రాజకీయ శూన్యత ఉందని.. జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ కు మంచి స్పష్టత ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. బీజేపీ పేరుకు జాతీయ పార్టీ అయినా.. దాన్ని కేవలం గుజరాతీలు నడుపుతున్నారని విమర్శించారు.

అంతా ఫేక్

అంతా ఫేక్


గుజరాత్ మోడల్ అంతా ఫేక్ అని.. ప్రధాని మోడీ అసమర్థుడని ఆరోపించారు. తమకు అవకాశం వస్తే తెలంగాణ మోడల్ ను దేశవ్యాప్తంగా అమలు చేసి చూపిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రకటనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని.. పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి మద్దతు వ్యక్తమవుతోందని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ అమలు చేస్తున్న రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు వంటి కార్యక్రమాలను దేశమంతా అమలు చేయాలన్న డిమాండ్లు ఉన్నాయన్నారు.

 కాంగ్రెస్ ఫెయిల్యూర్

కాంగ్రెస్ ఫెయిల్యూర్


జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్‌ దేశానికి గుదిబండ అని.. 2024 తర్వాత ఆ పార్టీ కనుమరుగయ్యే అవకాశాలే ఎక్కువని కామెంట్ చేశారు.

గోల్ మాల్ గుజరాత్

గోల్ మాల్ గుజరాత్

ప్రధాని మోడీపై కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా గోల్ మాల్ గుజరాత్ అంటూ ఫైరయ్యారు. ఈ 8 ఏళ్లలో ఏం చేశారని అడిగారు. మోడీ జన్ కీ బాత్ వినరని.. మన్ కీ బాత్ మాత్రమే చెబుతారని తెలిపారు. 2022 వరకు అందరికీ ఇళ్లు ఇస్తామని మోడీ చెప్పారని.. రూ.435 కోట్లతో ఆయన ఇల్లు కట్టుకున్నారని కేటీఆర్ ఫైరయ్యారు.
పండగగా సాగు

పండగగా సాగు


సాగును పండగ అని కేసీఆర్ నిరూపించారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వ్యవసాయానికి 24 గంటలు ఉచితంగా విద్యుత్ ఇవ్వొచ్చని నిరూపించారని కొనియాడారు. ప్లోరైడ్ సమస్యను మిషన్ భగీరథతో పరిష్కరించామని తెలిపారు. నైజీరియా కంటే దారుణంగా భారత్ తయారవుతుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ద్వారా సమస్యలకు పరిష్కారం చూపిస్తామని తెలిపారు.

English summary
prime minister narendra modi not listein people opinion telangana minister ktr said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X