హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వీడేం పూజారిరా నాయనా.. ముక్తి కోసం గుడికొస్తే, నగలు తీసుకొని చంపేశాడు..

|
Google Oneindia TeluguNews

భుక్తి కోసం.. ముక్తి కోసం ప్రార్థన మందిరానికి వెళుతుంటాం.. అదీ ఆలయం, చర్చి, మసీదు కావచ్చు. అయితే ఒంటరికి వెళ్లొద్దు.. అదీ కూడా సాయంత్రం పూట వెళ్లద్దు.. ఎందుకు అంటే.. ఆలయాలు ఎలాగైనా శివారులో ఉంటాయి. అక్కడ మిగతా భక్తులు లేరనుకో.. పూజారీ ఏమైనా చేయొచ్చు.. అంటే ఒంటి నిండా బంగారు ఆభరణాలు ఉంటే చోరీ చేయొచ్చు.. లేదంటే హత్య కూడా చేయచ్చు.. మల్కాజిగిరిలో ఉమాదేవి అనే మహిళ ఇదేవిధంగా హత్యకు గురయ్యింది. దీనిని బట్టి మిగతా వారు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

ఉమాదేవి హత్య కేసును పోలీసులు ఛేదించారు. సిద్ధి వినాయక ఆలయానికి వెళ్లిన ఉమాదేవిని విగత జీవిగా మారింది. అయితే ఆమె సాయంత్రం వెళ్లడం.. ఒంటి నిండ పది తులాల బంగారు ఆభరణాలు ఉండటంతో పూజారి మురళీ కృష్ణకు దుర్బుద్ది పుట్టింది. మంచి, మానవత్వం కూడా ఆలోచించలేదు. మహిళను హత్య చేసి.. నగలు తీసుకున్నాడు. పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

police are revealed malkajgiri murder mystery

ఈ నెల 18వ తేదీన సిద్ధి వినాయక ఆలయానికి వెళ్లిన ఉమాదేవి ఆ తర్వాత నుంచి కనించకుండా పోయారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌ పరిశీలించారు. గుడికి వెళ్లిన ఉమాదేవి గురించి విచారణ చేయగా ఎవరిపై సందేహాం కలుగలేదు. ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాలు కూడా లేవు. ఆలయం వెనుక భాగంలో నాలా, తుప్పు ఉంది.

ఉమాదేవి ఇంటికి తిరిగిరాలేదు. ఆమె కనిపించడం లేదని పోస్టర్లు కూడా అతికించారు. ఉమాదేవి మిస్సింగ్ అయ్యాక ఆమె కోసం గాలిస్తున్న పోలీసులు...ఇవాళ ఆలయం పరిసరాల్లో విస్తృతంగా వెతికారు. నాలాలు, తుప్ప ఉన్న ప్రదేశంలో మహిళ మృతదేహం కనిపించింది. దీంతో కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. అక్కడ క్లూస్ ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. పోస్ట్‌మార్టం పూర్తయ్యాక ...ఉమాదేవి మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు అంటున్నారు. కానీ ప్రాథమికంగా మాత్రం.. పూజారి హత్య చేశాడని ధృవీకరించారు.

English summary
police are revealed malkajgiri murder mystery. temple priest is culprit they said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X