హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉద్యోగుల అరెస్ట్: పీఆర్సీ, ఐఆర్, పాత పెన్షన్ కోసం అసెంబ్లీ ముట్టడి, ఇందిరాపార్క్ వద్ద అదుపులోకి..

|
Google Oneindia TeluguNews

ఐఆర్, పీఆర్సీ వెంటనే విడుదల చేయాలని శుక్రవారం ఉద్యోగ ఉపాధ్యాయ ఐక్య వేదిక పిలుపునిచ్చిన చలో అసెంబ్లీ ఉద్రిక్తంగా మారింది. ఇందిరాపార్క్ నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయులు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తమ డిమాండ్లపై శాంతియుతంగా నిరసన చేపడుతుంటే.. తమను అరెస్ట్ చేయడం సరికాదన్నారు. ప్రభుత్వ తీరును ఖండిస్తూ.. వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

పాత పెన్షన్..

పాత పెన్షన్..


పీఆర్సీ, ఐఆర్ సహా టీచర్లకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. లేదంటే ఉద్యమం ఉగ్రరూపం దాల్చుతోందని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలుపడం కూడా హక్కేనని.. దానిని హరించివేయడం మంచి పద్ధతి కాదన్నారు. తామేమి గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, న్యాయమైన తమ డిమాండ్ల కోసం పోరుబాట పడుతున్నామని వివరించారు. కానీ తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఫైరయ్యారు.

18 డిమాండ్లు..

18 డిమాండ్లు..

తమ 18 డిమాండ్లు నెరవేర్చాలని ఉద్యోగులు కోరారు. మహిళలు అని కూడా చూడకుండా అరెస్ట్ చేయడం సరికాదన్నారు. పీఆర్సీ ఇస్తామని చెప్పి రెండేళ్లు అవుతోంది.. కానీ ఇంతవరకు చర్యలు చేపట్టలేదన్నారు. డిమాండ్ల కోసం ఆత్మగౌరవంతో పోరాడుతున్నామని ఉద్యోగులు పేర్కొన్నారు. తమ హక్కుల కోసం పోరాడితే సంకెళ్లు వేయడం సరికాదన్నారు.

ఏబీవీపీ కూడా..

ఏబీవీపీ కూడా..

బుధవారం ఏబీవీపీ కూడా అసెంబ్లీని ముట్టడించింది. తెలంగాణ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తుందని ఛలో అసెంబ్లీకి ఏబీవీపీ ముట్టడించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పదుల సంఖ్యలో విద్యార్థి, విద్యార్థిని నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి, గేటు దూకేందుకు ప్రయత్నించి పోలీసులకు చెమటలు పట్టించారు. అసెంబ్లీ గేటు వద్ద ఉన్న విద్యార్థులను అదుపులోకి తీసుకొని.. పరిస్థితి కంట్రోల్ చేయడానికి పోలీసులకు ముచ్చెమటలు పట్టాయి. విద్యారంగాన్ని సీఎం కేసీఆర్ నిర్లక్యం చేస్తున్నారని స్టూడెంట్స్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. మహిళా విద్యార్థులు కూడా ఆందోళనలో పాల్గొని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Recommended Video

National Handloom Weavers JAC Dharma Porata Deeksha | Oneindia Telugu
ఆగిన స్కాలర్‌షిప్

ఆగిన స్కాలర్‌షిప్


ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయి వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు నినాదాలు చేశారు. రీయింబర్స్ మెంట్ ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో తమకు స్కాలర్ షిప్ రావడం లేదని చెప్పారు. బడ్జెట్‌లో కేటాయించిన రూ.3 వేల కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరారు. వర్సిటీల్లో ఖాళీలను ఎప్పుడూ భర్తీ చేస్తారు అని ప్రశ్నించారు. విశ్వవిద్యాలయాల్లో వైస్ చాన్స్‌లర్ పోస్ట్ ఖాళీగా ఉండటం ఏంటీ అని ధ్వజమెత్తారు. టీచర్ పోస్టులను కూడా పిలప్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 50 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని గుర్తుచేశారు.

English summary
ir, prs, old pension implemented are demands teachers, employees are agitation at indira park.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X