రేవంత్ రెడ్డిపై రెండు కేసులు నమోదు.. కారణమిదే
టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై రెండు కేసులు ఫైల్ అయ్యాయి. నిన్న అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టే సమయంలో జరిగిన ఉల్లంఘనలపై కేసు కట్టారు. అనుమతి లేకున్నా ర్యాలీ తీసినందుకు రేవంత్ రెడ్డిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. జూబ్లీహిల్స్‌లో డిజాస్టర్ మేనెజ్‌మెంట్ కింద కేసు ఫైల్ చేశారు. దీంతోపాటు బేగం బజార్‌లో రేవంత్ రెడ్డిపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు.
బుధవారం పెద్దమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం భారీ ర్యాలీగా గాంధీభవన్‌కు చేరుకున్నారు రేవంత్ రెడ్డి. టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించే ముందే అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. తర్వాత నాంపల్లి దర్గాలో ప్రార్థనలు చేశారు. అయితే రేవంత్ రెడ్డిపై కేసు నమోదు కావడంపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నారు. కావాలనే కేసులు ఫైల్ చేశారని మండిపడ్డారు.

Recommended Video
రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతల స్వీకరణ అట్టహాసంగా జరిగింది. కాంగ్రెస్ శ్రేణులు/ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. రేవంత్ రెడ్డి జై అనే నినాదాలతో ప్రాంగణం దద్దరిల్లిపోయింది. చాలాచోట్ల బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై విరుచుకుపడ్డారు. మొత్తానికి రేవంత్ రెడ్డి బాధ్యతల స్వీకరణ ఘనంగా జరగగా.. పోలీసులు మాత్రం రెండు కేసులు పెట్టారు. ఇదీ ముమ్మాటికీ కక్షసాధింపే అని కాంగ్రెస్ శ్రేణులు ఫైర్ అవుతున్నారు.












Click it and Unblock the Notifications