తొమ్మిదేళ్ల ప్రేమ... ఏడాదిన్నర క్రితం పెళ్లి... ఇప్పుడు విడాకులు : ట్రైనీ ఐపిఎస్ భార్య

ట్రైయిని ఐపిఎస్ మహెశ్వర్ రెడ్డి చేతిలో మోసపోయిన భావన కేసుపై పోలీసులు ఎలాంటీ చర్యలు తీసుకోవడం లేదంటూ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ డీజీపీ మరియు రాచకొండ కమిషనర్ మహెష్ భగవత్‌ వద్దకు వెళ్లినా వారు పట్టించుకోవడం లేదని వాపోయింది. ఇక మహెష్ భగవత్ తన ఐపిఎస్ హోదాను ప్రదర్శించారని , కుషాయిగూడ ఏసీపీ శివకుమార్ తనను నీచంగా చూస్తున్నారని భావన ఆరోపణలు చేశారు. కేసు విషయంలో న్యాయం జరగకపోగా ఇబ్బందులు ఎక్కువగా ఎదురవుతున్నాయని ఆమె చెప్పారు.

కడప జిల్లాకు చెందిన ట్రైని ఐపిఎస్ మహెశ్వర్ రెడ్డి ప్రేమించి పెళ్లిచేసుకుని ఐపిఎస్ అయిన తర్వాత వేధింపులకు గురి చేస్తున్నాడంటూ హైదరాబాద్ బోయిన్‌పల్లికి చెందిన భావన పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే...అయితే కేసుకు సంబంధించి బాధితురాలికి పోలీసులు ఎలాంటీ సహాకారం అందించడం లేదంటూ బుధవారం మీడియా ముందుకు వచ్చింది.

police not taking any action against trainee IPS Maheshwar Reddy

దీంతో పలు విషయాలను వెల్లడించింది. గత తొమ్మిదేళ్లుగా ప్రేమించిన మహెశ్వర్ రెడ్డితో ఏడాదిన్నర క్రితం పెళ్లి జరిగిందని తెలిపింది. అయితే చదువుకుంటున్న సమయంలో పెళ్లిగురించి ఇంట్లో చెప్పని మహెష్ సెటిలయ్యాక చెబుతానని అన్నాడు.

police not taking any action against trainee IPS Maheshwar Reddy

ఇక ఐపిఎస్ అయిన తర్వాత ఆయన ప్రవర్తనలో మార్పులు వచ్చాయని ,ఎక్కువ కట్నం తీసుకుని మరోపెళ్లి చేసుకునేందుకు సిద్దమయ్యాడని తెలిపింది. ఇందుకోసమే కులం పేరుతో వేధింపులకు గురి చేసి దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని తెలిపింది. కులం కారణంగా మహెశ్వర్ రెడ్డి ఇంట్లో ఒప్పుకోవడం లేదని చెబుతున్నాడని తెలిపింది. ఇక మహెశ్వర్ రెడ్డితో పాటు ఆయన స్నేహితుడు నాగేందర్ రెడ్డి కూడ తనను వేధించాడని మీడియా ముందు వాపోయింది. పోలీసులు కూడ సరైన స్పందన లేదని చెప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+