• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

చివరి గుడిసెకూ ఫలాలు - కొత్త చట్టాలతో పేదలకు బాధ కలగొద్దు: సీఎం కేసీఆర్

|

తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన నూతన చట్టాల అమలు సందర్భంగా, ఏ ఒక్క నిరుపేదకూ బాధ కలుగకుండా, చివరి గుడిసె వరకు వాటి ఫలితాలు అందేలా చూడటమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. నూటికి నూరుశాతం ప్రజలే కేంద్ర బిందువులుగా, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తీసుకొస్తున్న నూతన చట్టాల అమలు కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు 24 గంటలూ శ్రమించాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రజాప్రతినిధులతో భేటీ

ప్రజాప్రతినిధులతో భేటీ

చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న నివాస స్థలాలు, సంబంధిత భూ సమస్యల పరిష్కారానికై మున్సిపాలిటీల పరిధిలోని ప్రజా ప్రతినిధులు, మేయర్లతో సీఎం గురువారం ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. మున్సిపాలిటీల పరిధిలో ఇప్పటికీ ఆన్ లైన్ లో నమోదుకాని ప్రజల ఇండ్లు, ప్లాట్లు, అపార్టుమెంట్ ఫ్లాట్స్, వ్యవసాయేతర ఆస్తుల వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేసే ప్రక్రియలో క్షేత్రస్థాయిలో భాగస్వాములు కావాలని కేసీఆర్ వారికి సూచించారు.

1లక్ష జాబ్స్, 15లక్షల మందికి ఉపాధి - గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ టీఆర్ఎస్‌దే - కేటీఆర్ దిశానిర్దేశం

ఖజానా నింపుకొడానికి కాదు..

ఖజానా నింపుకొడానికి కాదు..

స్వయంపాలనలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న విప్లవాత్మక పాలనా సంస్కరణల్లో భాగంగా అమలు పరుస్తున్న వినూత్న చట్టాలు పదికాలాలపాటు ప్రజలకు మేలు చేయనున్నాయని, వాటిని జాగ్రత్తగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులు, అధికారులదే అని సీఎం తెలిపారు. భూములను క్రమబద్దీకరించడం ద్వారా పేదల నుంచి వచ్చే పైసలతో ఖజానా నింపుకోవాలని తమ ప్రభుత్వం చూడటం లేదని సీఎం ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ధరణి పూర్తిస్థాయిలో రూపుదిద్దుకునే లోపే ప్రజలు ఎదుర్కొంటున్న భూములు, ఆస్తుల సమస్యలన్నింటినీ గుర్తించి, వాటికి విధానపరమైన పరిష్కారాలను రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

కొడాలి 100 తప్పలు కాస్తాం: జీవీఎల్ -జెరుసలేంకు భార్యతోనే వెళ్లారుగా: స్వామి -నాని కన్నీటిపర్యంతం

గంగా జమునా తెహజీబ్..

గంగా జమునా తెహజీబ్..

‘‘తెలంగాణకు శాపాలు పెట్టినవాళ్ల అంచనాలను తలక్రిందులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు విపరీతంగా డిమాండ్ పెరుగుతూ వస్తున్నది. సుస్థిరపాలన వల్ల భూ తగాదాలు, భూకబ్జాలు, దౌర్జన్యాలు, వేధింపులు, గుండాగిరీ తగ్గింది. అభివృద్దితో హైదరాబాద్ నగరానికి ఉండే గంగా జమునా సంస్కృతిని ద్విగుణీకృతమైంది. మార్వాడీలు, గుజరాతీలు, సింథీలు, పార్శీలు, దేశం నలుమూలల నుంచీ వచ్చి హైదరాబాద్ లో స్థిరపడ్డ ప్రజలు తమ భవనాలను, ఆలయాలను నిర్మించుకొని, వారి సంస్కృతులను స్వేచ్ఛగా చాటుకుంటున్నారు. పేదరికానికి కులం, మతం లేదు. కులాలు, మతాలకు అతీతంగా అవసరమున్న ప్రజలందరి కోసం పనిచేసే ప్రభుత్వం మనది'' అని సీఎం అన్నారు.

  LRS G.O.131 రద్దు చేయాలని Telangana రాష్ట్ర వ్యాప్తంగా BJP నిరసన
  ధరణితో గుణాత్మక మార్పు..

  ధరణితో గుణాత్మక మార్పు..

  గుణాత్మక మార్పుకోసం, ప్రజల జీవితాల్లో పరివర్తన కోసం చట్టాలలో మార్పులు తెచ్చినపుడు గరీబులకే అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని, ధరణి వెబ్ పోర్టల్ ను వినియోగంలోకి తీసుకు రావడం ద్వారా ఈ లక్ష్యం నెరవేరుతుందని, పేదల ఆస్తులకు పూర్తి రక్షణ దొరుకుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. వ్యవసాయ భూములను ఆకుపచ్చ పాస్ పుస్తకాలను, వ్యవసాయేతర ఆస్తులకు మెరూన్ రంగు పాస్ బుక్కులను అందజేయడం ద్వారా ప్రజలకు సంబంధించిన ప్రతి అంగుళం ఆస్తిని ఆన్ లైన్ లో నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ఆయా మున్సిపాలిటీల పరిధిలోని ప్రజా ప్రతినిధులు, మేయర్లతోపాటు కీలక శాఖల మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

  English summary
  Chief Minister K. Chandrashekar Rao has made it clear that the Telangana State government’s aim was to ensure that the poor should not suffer due to the implementation of the new Acts and the fruits of the Acts should reach the poor and the last mile. The CM reiterated that public representatives and officials should work 24x7 hours for the implementation of the new Acts, which were people centric and were brought in for the welfare of people. CM held a review meeting on Thursday at Pragathi Bhavan with public representatives from the municipal areas and Mayors.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X