కరెంట్ చార్జీల మోత.. రంగం సిద్దం.. ఎంత అంటే
నిత్యావసర వస్తువుల ధర వాత.. మంచి నూనె ధర పెరుగుదుల.. రేపో, మాపో పెట్రోల్ ధర కూడా పెరుగుతుందట.. దీంతో సామాన్యుడు దిగాలుగా ఉన్నాడు. దీనికి అదనంగా విద్యుత్ ఛార్జీల వాత కూడా తప్పదని అంటున్నారు. అవును తెలంగాణ పవర్ బిల్లు మోత మోగనుంది. ఈ అంశం మధ్య తరగతి జనం జీర్ణించుకోవడం లేదు.

చార్జీల మోత..
తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ చార్జీల బాదుడు ఖాయంగా కనిపిస్తోంది. బడ్జెట్‌లో వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా కేటాయింపులు లేవు. దీంతో డిస్కమ్‌లు భారీ బాదుడుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో గృహ వినియోగదారులకు యూనిట్‌కు 50 పైసలు, లోటెన్షన్‌లో గృహేతర, హైటెన్షన్ వినియోగదారులకు యూనిట్‌కు రూ.1 పెంచాలని డిస్కమ్‌లు నిర్ణయించారు. చార్జీలపెంపు రూపంలో రూ.6,831 కోట్లను వసూలు చేసుకోవాలని డిస్కమ్‌లు ఏఆర్‌ఆర్/టారిఫ్ ప్రతిపాదనలను తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలిలో సమర్పించిన విషయం తెలిసిందే.

6 వేల కోట్ల భారం
కరెంటు చార్జీల పెంపు కోసం ఈఆర్‌సీ ఉత్తర్వులు ఇవ్వనుంది. రూ. 6 వేల కోట్లపైన కరెంట్ చార్జీల పెంపు భారం ఉండనుంది. డిస్కమ్‌లు భారీగా చార్జీల పెంపునకు నిర్ణయం తీసుకోగా.. ఆ మేరకు భారం ఉండదని, చార్జీలు భారీగా పెంచకుండా ప్రభుత్వం సబ్సిడీ పెంచుతుందని అంతా భావించారు. ఇంతలో ఒక్కరూపాయి కూడా సబ్సిడీ పెంచేది లేదని బడ్జెట్‌లో తేలిపోయింది. మరోవైపు వ్యవసాయానికి కరెంట్ సరఫరా చేయడానికి అయ్యే వ్యయం భారీగా పెరుగుతున్నా.. ఆ మేరకు సబ్సిడీలు పెంచకపోవడంతో డిస్కమ్‌లు పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోనున్నాయి.

ఎన్నికలు లేవుగా..? అందుకే
వీటన్నింటినీ పరిశీలించి ధరల వాత తప్పడం లేదు. అవును కానీ అదీ ఎంత ఉంటుందో చెప్పలేం. మరోవైపు డెవలప్ మెంట్ చార్జీలు అని బాదుతున్నారు. దీంతో చాలా చోట్ల ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు కరెంట్ బిల్లు పెరిగితే.. ఏం చేయాలో వారికి అర్థం కావడం లేదు. ఇప్పట్లో ఎన్నికలు లేనందున.. ఏం చక్కా చార్జీలు పెంచేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. జనం గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్నందున.. మెల్లగా చార్జీలు పెంచేందుకే ప్రభుత్వం మొగ్గుచూపుతుంది.












Click it and Unblock the Notifications