Hyderabad: హైదరాబాద్ లో భారీగా పెరిగిన కరెంట్ వాడకం.. కోతలు తప్పవా..!
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో ప్రజలు కూలర్లు, ఏసీల వాడకం పెంచారు. దీంతో హైదరాబాద్‌లో విద్యుత్ వినియోగం 79.48 మిలియన్ యూనిట్లకు పెరిగింది. ఇది రాష్ట్రంలో విద్యుత్ వినియోగంలో గణనీయమైన పెరుగుదల అని అధికారులు చెబుతున్నారు. ఈ డిమాండ్ గత ఏడాది మే 19న నమోదైన 79.33 MUను అధిగమించింది. సదరన్ డిస్కమ్ - TSSPDCL అధికారులు నివేదిక ప్రకారం గ్రేటర్ హైదరాబాద్‌లో రోజువారీ ఇంధన వినియోగం ఈ సంవత్సరం 22.7% పెరిగి, సగటున రోజుకు 70.96 మిలియన్ యూనిట్లకు (MU) చేరుకుంది.
ఇది గత సంవత్సరం సగటు 57.84 MUతో పోలిస్తే ఎక్కువ. వేసవి ప్రభావం కారణంగా విద్యుత్ వినియోగం పెరిగింది. ఈ పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు ప్రతిస్పందనగా, రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) ఏ డిమాండ్‌నైనా తీర్చడానికి సిద్ధంగా ఉన్నాయని చెబుతున్నారు. అవసరమైన అదనపు పంపిణీ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్‌లను ఏర్పాటు చేస్తున్నారు.

సవాళ్లు ఎదురైనప్పటికీ, ఆ తర్వాత విద్యుత్ వినియోగం పెరిగినప్పటికీ, అన్ని రంగాలకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నామని అధికారులు చెబుతున్నార. డికామ్‌లు డిమాండ్, సరఫరా, సిబ్బంది హాజరును పర్యవేక్షించడానికి, సరఫరా అంతరాయాలను పరిష్కరించడానికి మేనేజర్‌లు, ఇంజనీర్‌లతో రోజువారీ టెలికాన్ఫరెన్స్‌లను నిర్వహిస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 212 సెక్షన్ లెవల్ ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీసుల్లో విద్యుత్ అత్యవసర పరిస్థితుల్లో దాదాపు 800 మంది సిబ్బందిని ఎల్లవేళలా అందుబాటులో ఉంచారు. అంతేకాకుండా, డిస్కమ్ శాఖ అధికారులందరూ ప్రతిరోజూ కనీసం తొమ్మిది గంటలు లేదా పీక్ అవర్స్ పూర్తయ్యే వరకు విధుల్లో ఉండాలని ఆదేశించారు. సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉండేలా చూడడానికి కనీసం వారానికి ఒకసారైనా మురికివాడలతోపాటు నివాస కాలనీలను సందర్శించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications