ప్రియాంకా రెడ్డి హత్య: హైదరాబాద్-బెంగుళూరు హైవేపై నిరసన..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
తెలంగాణ రాష్ట్రంలో ప్రియాంక రెడ్డి హత్య కలకలం రేపుతుంది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ వద్ద జరిగిన దారుణం లో పోలీసులు ఇప్పటికే కీలక ఆధారాలను సేకరించారు. ప్రియాంక రెడ్డి ని అత్యాచారం చేసి, అతి దారుణంగా హత్య చేసి ఆపై 28 కిలోమీటర్ల మేర మృతదేహాన్ని తీసుకు వెళ్లి అక్కడ పెట్రోల్ పోసి తగలబెట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇక ఈ కేసులో నిందితులను పట్టుకోవడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు.
అయితే ప్రియాంక రెడ్డి దారుణ హత్య నేపథ్యంలో, రహదారులపై రక్షణ లేదనే భావనతో హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై నిరసన వ్యక్తం చేశారు స్థానికంగా ఉన్న ప్రజలు. ప్రియాంక రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని నక్షత్ర విల్లాస్ నుండి క్యాండిల్ ర్యాలీ నిర్వహించిన కాలనీవాసులు ర్యాలీగా వస్తూ హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు.

జాతీయ రహదారుల మీద, రహదారుల మీద రక్షణ లేకుండా పోతుందని తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కాలనీవాసులు ఆందోళనతో జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది.ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
Recommended Video
అత్యంత పాశవికంగా లారీ డ్రైవర్లు వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డిని అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై మహిళా సంఘాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ప్రియాంక రెడ్డి పై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ ప్రధానంగా వినిపిస్తుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాతీయ రహదారులపై తగిన భద్రతను కల్పించాల్సిన అవసరం ఉందని మహిళా సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications