హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాహుల్ పర్యటన ఖరారు.. ఆగస్ట్ 21న సిరిసిల్లకు రాక, నిరుద్యోగ డిక్లరేషన్

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటన ఖరారు అయ్యింది. ఇదివరకే వరంగల్ సభకు రాహుల్ హాజరైన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి రానున్నారు. ఇటీవల సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ బీజేపీ విజయ సంకల్ప సభ నిర్వహించింది. దానిని మించి చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. ఇటు టీఆర్ఎస్ పార్టీ కూడా భారీ బహిరంగ సభ నిర్వహించాలని అనుకుంటుంది.

 ఆగస్ట్ 21వ తేదీన రాహుల్ రాక

ఆగస్ట్ 21వ తేదీన రాహుల్ రాక

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆగస్టు 21వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తారు. రాహుల్ పర్యటనపై ఏఐసీసీ టీపీసీసీకి సమాచారం ఇచ్చింది. నిరుద్యోగ సమస్యలపై నిరుద్యోగ డిక్లరేషన్ చేసేందుకు టీపీసీసీ కసరత్తు చేస్తోంది. ఆగస్టు 21న సిరిసిల్లలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తోంది. రాహుల్ గాంధీ ద్వారా నిరుద్యోగ డిక్లరేషన్ ప్రకటించాలని టీ కాంగ్రెస్ భావిస్తోంది.

సిరిసిల్లకు రాక

సిరిసిల్లకు రాక


వాస్తవానికి సెప్టెంబర్‌లో రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ రానున్నారని సమాచారం ఉంది. కానీ అదీ మరీ కాస్త ముందుకు వచ్చింది. మంత్రి కేటీఆర్ నియోజకర్గం సిరిసిల్లకు వస్తారు. అక్కడి నుంచే నిరుద్యోగ డిక్లరేషన్‌ను విడుదల చేస్తారని తెలిసింది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఉంటాయి. జాబితాలో వివిధ పార్టీలకు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సహా పలువురు కీలక నేతలు ఉన్నారు. విడతల వారీగా చేరికలు ఉండేలా నాయకత్వం వ్యూహరచన చేసింది.

రేవంత్ ఫైర్

రేవంత్ ఫైర్


ఇటు రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక సందర్భంగా విపక్షాల మీటింగ్‌కి సీఎం కేసీఆర్ ఎందుకు డుమ్మా కొట్టారని రేవంత్ రెడ్డి అడిగారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి బీజేపీ సహాయం చేస్తోందని ఫైరయ్యారు. పరేడ్ గ్రౌండ్‌లో బీజేపీ అయ్యింది.. టీఆర్ఎస్ సభ పెట్టాలి.. ఆ తర్వాత మూడో సభ కాంగ్రెస్ పార్టీ పెడుతుందని రేవంత్ చెప్పారు. ఏ సభకు ఎంతమంది వస్తారో చూడాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

English summary
congress leader Rahul gandhi come to telangana on august 21st
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X