హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తీపి కబురు.. ఐదు రోజులు విస్తారంగా వర్షాలు

|
Google Oneindia TeluguNews

మ‌రో మూడు రోజుల్లో తెలంగాణ అంత‌టా నైరుతి రుతుప‌వ‌నాలు విస్త‌రించ‌నున్నాయి. వ‌చ్చే మూడు రోజులపాటు తేలిక‌పాటి నుంచి ఓ మోస్త‌రు వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంది. ఉత్త‌ర బంగాళాఖాతంలో ఈ నెల 11న అల్ప‌పీడ‌నం ఏర్ప‌డే అవ‌కాశం ఉంది. అల్ప‌పీడ‌న ప్ర‌భావంతో రాగ‌ల ఐదు రోజుల్లో తెలంగాణ అంత‌టా విస్తారంగా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 12, 13 తేదీల్లో కొన్ని చోట్ల అత్యంత భారీ వ‌ర్షం ప‌డనుంద‌ని తెలిపారు.

Recommended Video

Southwest Monsoon కేరళ సహా దక్షిణాది రాష్ట్రాలపై ప్రభావం | Weather Update | IMD || Oneindia Telugu

ఇప్పటికే తేలికపాటి జల్లులు కురవడంతో భూమి కాస్త చల్లబడింది. ఇలాగే వర్షాలు కురిస్తే అన్నదాతలు వ్యవసాయ పనుల్లో నిమగ్నం అవుతారు. క్రమంగా చెరువులు, కుంటలు నిండుకుంటాయి. వర్షాధార పంటలకు వానలు ఇంపార్టెంట్.. దేశంలో చాలా మట్టుకు వర్షాల మీద ఆధారపడి వ్యవసాయం జరుగుతుంది. బావులు, మోటార్లు తక్కువ మంది రైతులకు ఉంటాయి.

Rain forecast in telangana state in five days

ఒకటి రెండు వానలు పడితే చాలు రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నం అవుతారు. నెల రెండు నెలలపాటు బిజీగా ఉంటారు. వర్షాలతో ప్రాజెక్టులకు జలకళ సంతరించుకోనుంది. మత్తళ్లు దుంకిపోస్తాయి. వాటర్ పాల్స్ వద్ద పర్యాటకుల శోభ నెలకొననుంది.

English summary
Rain forecast in telangana state in five days officials said to media
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X