ఖైరతాబాద్ వినాయకుడి వద్ద రాజా సింగ్ అనుచరుల హల్ చల్.. ప్లెక్సీలు పట్టుకొని
గణనాథుడు అంటే ఖైరతాబాద్ వినాయకుడే.. ఇవాళ వినాయక చవితి కావడంతో దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరతారు. ఇదే అదను చూసి కొందరు నిరసన కూడా తెలిపారు. రాజా సింగ్ అనుచరులు ఖైరతాబాద్ వినాయకుడి వద్ద హల్ చల్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టయిన రాజాసింగ్ 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు.
గణేశ్ విగ్రహం వద్ద ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. రాజాసింగ్ విడుదల చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. ఆరుగురు యువకులను సైఫాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. రాజాసింగ్ పై మొత్తం కలిపి 101 కేసులు నమోదయ్యాయి. ఇటీవల ఓ మతాన్ని కించపరిచేలా వాఖ్యలు చేసినందుకు 18 కేసులు నమోదయ్యాయి.

Recommended Video
పీడీ యాక్ట్ నమోదు చేస్తే మూడు నెలల వరకు ఎలాంటి బెయిల్ మంజూరు కాదు. రాజాసింగ్ మద్దతుదారులు నిరసనలు తెలుపుతున్నారు. ఇవాళ వినాయక చవితి కావడంతో పలువురు నేతలు, భక్తులు పెద్ద సంఖ్యలో ఖైరతాబాద్ గణేశుడి విగ్రహాన్ని చూడడానికి వస్తున్నారు. అక్కడ ఎమ్మెల్యే రాజాసింగ్ అనుచరులు ఆందోళనకు దిగడం కలకలం రేపింది.
మునావర్ ఫరూఖీ షో నిర్వహించడంపై రాజా సింగ్ తప్పుపట్టారు. తర్వాత మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి.. వీడియోను రిలీజ్ చేశారు. దీంతో ముస్లింలు ఆందోళనకు దిగారు. రాజా సింగ్ కామెంట్లను బీజేపీ కూడా సీరియస్ తీసుకొని.. అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications